Watermelon Seeds: పుచ్చకాయ గింజలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు..

Updated on: Mar 27, 2026 | 2:52 PM

వేసవిలో మధ్యాహ్నం.. చల్లటి పుచ్చకాయ ముక్కను ఆస్వాదిస్తుంటే వచ్చే ఆ మజాయే వేరు. చాలా మంది మధ్యలో అడ్డుపడే గింజలను తీసిపారేస్తుంటారు. ఒక్కోసారి వాటిని తిని ఏమవుతుందోనని కంగారుపడుతుంటారు. అయితే మనం చెత్త అని పారేస్తున్న ఆ గింజలే నిజానికి పోషకాల గని అని మీకు తెలుసా..? కేవలం నీరు, తీపి మాత్రమే కాదు.. పుచ్చకాయ గింజల్లో గుండెను పదిలంగా ఉంచే ప్రోటీన్లు, చర్మాన్ని మెరిపించే ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

1 / 5
ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి మనందరం పుచ్చకాయలను ఆశ్రయిస్తుంటాం. అయితే పుచ్చకాయ ముక్కలు తినేటప్పుడు గింజలు అడ్డు వస్తే చిరాకు పడుతుంటాం.. పొరపాటున ఒక గింజ గొంతులోకి వెళ్తే కంగారు పడిపోతుంటాం. కానీ, మీరు ఇన్నాళ్లూ పారేస్తున్న ఆ నల్లటి గింజలే అసలైన సూపర్‌ఫుడ్ అని మీకు తెలుసా?

2 / 5
పరిశోధనలు అదే చెబుతున్నాయి. పుచ్చకాయ గింజలు మింగడం ప్రమాదకరం అనే అపోహను వీడాల్సిన సమయం వచ్చేసింది. ఐసీఎంఆర్ నివేదికల ప్రకారం.. ఈ గింజలు కేవలం వ్యర్థాలు కావు, ఇవి ప్రోటీన్లు, ఖనిజాల గని. వీటిలో దాదాపు 30శాతం ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని ఆర్జినైన్ అనే అమైనో ఆమ్లం రక్తపోటును నియంత్రించి, గుండెను పదిలంగా ఉంచుతుంది.

3 / 5
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే మెగ్నీషియం, రోగనిరోధక శక్తిని పెంచే జింక్, మరియు రక్తహీనతను తగ్గించే ఇనుము ఈ గింజల్లో మెండుగా ఉన్నాయి. తీవ్రమైన ఎండల వల్ల చర్మం తేమను కోల్పోతుంది. పుచ్చకాయ గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండా, వేసవి మొటిమలు రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా వేడి వల్ల గుండెపై పడే ఒత్తిడిని తగ్గించడంలో ఈ గింజల్లోని మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది.

4 / 5
పుచ్చకాయ గింజలను పచ్చిగా మింగడం వల్ల ప్రమాదం లేకపోయినా వాటి పూర్తి పోషకాలు అందాలంటే వాటిని మొలకెత్తించడం లేదా వేయించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. గింజలను కడిగి, ఎండబెట్టి.. కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి వేయించాలి. దానికి నల్ల ఉప్పు, కారం లేదా ఆమ్చూర్ పొడి జోడిస్తే కరకరలాడే రుచికరమైన స్నాక్ సిద్ధం. వీటిని మీ ఉదయపు పోహా, ఉప్మా లేదా స్మూతీల్లో కూడా కలుపుకోవచ్చు.

5 / 5
ఏదైనా అమితంగా తీసుకుంటే అనర్థమే. పుచ్చకాయ గింజలు కూడా రోజుకు ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. అతిగా తింటే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఇకపై పుచ్చకాయ తినేటప్పుడు ఆ గింజలను పారేయకండి. ప్రకృతి ప్రసాదించిన ఈ ఉచిత హెల్త్ సప్లిమెంట్‌ను ఆస్వాదించండి.

Follow Us