పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారుచేసే 5 పవర్‌ఫుల్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్

Updated on: Nov 26, 2026 | 7:03 PM

మనం ఎంతో ఇష్టంతో పెంచుకునే పూల మొక్కలు, కూరగాయల మొక్కలకు అకస్మాత్తుగా రకరకాల తెగుళ్లు సోకి నష్టం కలిగిస్తుంటాయి. ముఖ్యంగా పిండినల్లి (మిల్లీబగ్స్), ఆకుముడత, కంటికి కనిపించని చిన్న పురుగులు మొక్కల ఎదుగుదలను దెబ్బతీస్తాయి. వీటి కోసం మార్కెట్లో వందల రూపాయలు పెట్టి రసాయన మందులు కొనే బదులు, మన వంటింట్లో మరియు పరిసరాల్లో ఉచితంగా దొరికే వస్తువులతోనే శక్తివంతమైన ఆర్గానిక్ పెస్టిసైడ్స్ తయారు చేసుకోవచ్చు.

1 / 5
మొదటిది బేకింగ్ సోడా స్ప్రే. ఆకులు కొరికే పురుగులు, పిండినల్లి నివారణకు ఇది తక్షణ ఫలితాన్నిస్తుంది. ఒక లీటరు నీటిలో పావు చెంచా తినే సోడా కలిపి సాయంత్రం వేళల్లో మొక్కలపై పిచికారీ చేయాలి. అయితే ఎండ ఉన్నప్పుడు దీనిని అస్సలు వాడకూడదు, మోతాదు ఎక్కువైతే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది.

2 / 5
రెండోది పుల్లటి మజ్జిగ మరియు ఇంగువ ద్రావణం. నాలుగైదు రోజులు పులియబెట్టిన ఒక లీటరు మజ్జిగలో ఒక చెంచా ఇంగువ పొడి వేసి బాగా కలపాలి. దీనికి సమాన పరిమాణంలో నీరు కలిపి వడపోసి మిర్చి, నిమ్మ, మునగ మొక్కల ఆకుల అడుగు భాగాన స్ప్రే చేస్తే ఆకుముడత తగ్గి పూత బాగా నిలుస్తుంది.

3 / 5
మూడోది వేపాకు, వెల్లుల్లి ద్రావణం. గుప్పెడు వేపాకులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని వడపోసి ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే చలికాలంలో వచ్చే తెగుళ్లు దరిచేరవు.

4 / 5
నాలుగోది ఆల్-ఇన్-వన్ మిశ్రమం. ఒక లీటరు నీటిలో అర చెంచా బేకింగ్ సోడా, 3 నుంచి 5 మి.లీ. వేప నూనె, నూనె కరగడానికి కొన్ని చుక్కల లిక్విడ్ సోప్, అలాగే 3 నుంచి 5 మి.లీ. వెనిగర్ వేసి బాగా కలపాలి. దీనిని స్ప్రే చేస్తే పురుగులు గుడ్ల దశలోనే నశిస్తాయి.

5 / 5
ఐదోది ఏడాది పాటు నిల్వ ఉండే కషాయం. ఆవు మూత్రంలో వేపాకులు, చిన్న ముక్కలుగా కోసిన కలబంద, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయల పేస్ట్ వేసి 20 నిమిషాల పాటు బాగా మరిగించాలి. రాత్రంతా చల్లారిన తర్వాత రెండుసార్లు వడపోసి బాటిల్‌లో నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున కలిపి వాడుకోవాలి. ఈ సహజ పద్ధతులను సాయంత్రం పూట ఆకుల వెనుక భాగంలో తడిచేలా పిచికారీ చేస్తే మీ తోట నిత్యం పచ్చగా, ఆరోగ్యంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us