Glycerin for Face: శీతాకాలంలో పొడి చర్మం మృదువుగా మారాలంటే.. గ్లిజరిన్‌ ఇలా వాడి చూడండి

|

Jan 08, 2024 | 7:55 PM

శీతాకాలం చర్మ సంరక్షణలో గ్లిజరిన్ కీలక పాత్ర పోషిస్తుంది. గ్లిజరిన్ జిడ్డు లేదా సున్నితమైన చర్మం.. ఏ రకమైన చర్మానికి అయినా, ప్రయోజనకరంగా ఉంటుంది. గ్లిజరిన్‌ను వివిధ సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు. గ్లిజరిన్ పొడి చర్మానికి ప్రభావవంతంగా చికిత్స అందిస్తుంది. గ్లిజరిన్ చర్మాన్ని తడిగా ఉంచుతుంది. ఇది మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పనిచేసి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే ముడతలు, మచ్చలను తగ్గిస్తుంది. అలాగే స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది..

1 / 5
శీతాకాలం చర్మ సంరక్షణలో గ్లిజరిన్ కీలక పాత్ర పోషిస్తుంది. గ్లిజరిన్ జిడ్డు లేదా సున్నితమైన చర్మం..  ఏ రకమైన చర్మానికి అయినా, ప్రయోజనకరంగా ఉంటుంది. గ్లిజరిన్‌ను వివిధ సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు. గ్లిజరిన్ పొడి చర్మానికి ప్రభావవంతంగా చికిత్స అందిస్తుంది.

2 / 5
గ్లిజరిన్ చర్మాన్ని తడిగా ఉంచుతుంది. ఇది మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పనిచేసి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే ముడతలు, మచ్చలను తగ్గిస్తుంది. అలాగే స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది.

3 / 5
గ్లిజరిన్‌ను చర్మంపై నేరుగా వాడకూడదు. రోజ్ వాటర్‌లో కొన్ని చుక్కల గ్లిజరిన్ మిక్స్ చేసి ముఖానికి రాసుకోవచ్చు. గ్లిజరిన్ ఉపయోగించే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు నీటిలో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలపాలి. అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముఖమంతా అప్లై చేయాలి. ఈ విధంగా గ్లిజరిన్ ఉపయోగించడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.

4 / 5
చర్మాన్ని శుభ్రం చేయడానికి కూడా గ్లిజరిన్‌ని ఉపయోగించవచ్చు. 1/2 కప్పు నీటిలో 1/2 టీస్పూన్ గ్లిజరిన్, కార్న్‌ఫ్లోర్ కలపాలి. ఈ మిశ్రమంతో చర్మాన్ని మసాజ్ చేసుకుని గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గ్లిజరిన్‌ను టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. స్ప్రే బాటిల్‌లో మినరల్ వాటర్ తీసకుని, అందులో 2-3 చుక్కల గ్లిజరిన్ కలపాలి. టోనర్‌ని ముఖంపై స్ప్రే చేయడం వల్ల చర్మరంధ్రాలు మూసుకుపోయి చర్మం బిగుతుగా మారుతుంది.

5 / 5
1 చెంచా ముల్తానీ మట్టిలో, 1 చెంచా బాదం పేస్ట్ కలుపుకోవాలి. అందులో 2 స్పూన్ల గ్లిజరిన్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికోసారి వాడితే చలికాలంలో పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది.