
ప్రెషర్ కుక్కర్లలోని పాత రబ్బరు: ప్రెషర్ కుక్కర్‌లోని రబ్బరు లూజ్ అయినా, పాతబడినా వెంటనే మార్చాలి. అధిక వేడి, తీవ్రమైన ప్రెషర్ కారణంగా, పాతబడిన రబ్బరు నుండి హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. ఇవి కుక్కర్ లోపల ఉడుకుతున్న అన్నం లేదా కూరల్లో సులభంగా కలిసిపోతాయి. కాబట్టి నాణ్యమైన, కొత్త రబ్బరును మాత్రమే వాడటం అలవాటు చేసుకోవాలి.

నల్ల ప్లాస్టిక్ చెంచాలు: కూరగాయలను కలపడానికి లేదా వంట వడ్డించడానికి ఉపయోగించే పెద్ద పెద్ద నల్ల ప్లాస్టిక్ చెంచాలను వంటగది నుండి వెంటనే పారవేయండి. ఈ ప్రత్యేక రకమైన నల్ల ప్లాస్టిక్‌లో రీసైకిల్ చేసిన ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఈ చెంచాలు వేడి వేడి ఆహారాన్ని తాకినప్పుడు, ప్లాస్టిక్ కరిగి విషపూరిత రసాయనాలు ఆహారంలో కలిసిపోతాయి. ఇవి క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి.

గిన్నెలు తోమే సింథటిక్ స్పాంజ్: చాలా ఇళ్లలో గిన్నెలు తోమడానికి కలర్‌ఫుల్‌గా ఉండే సింథటిక్ స్పాంజ్‌లను ఉపయోగిస్తారు. వీటిని వెంటనే మార్చాలి. ఎందుకంటే.. వాడే కొద్దీ ఈ స్పాంజ్‌లలోని అతి సూక్ష్మమైన కణాలు, అంటే మైక్రో-ప్లాస్టిక్‌లు అరిగిపోయి గిన్నెలకు అంటుకుంటాయి. మనం ఆ గిన్నెల్లో తిన్నప్పుడు ఈ మైక్రో-ప్లాస్టిక్స్ నేరుగా కడుపులోకి చేరి, తీవ్రమైన అంతర్గత వ్యాధులను కలిగిస్తాయి.

ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్: కూరగాయలు త్వరగా కట్ చేసుకోవచ్చని ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను కొంటుంటారు. కానీ ఈ పలకపై కత్తితో కూరగాయలు కోస్తున్న ప్రతిసారీ, కంటికి కనిపించని మైక్రోప్లాస్టిక్ ముక్కలు కూడా కట్ అయి కూరగాయలతో కలిసిపోతాయి. దానికి బదులుగా, ఎల్లప్పుడూ సాంప్రదాయ పద్ధతిలో చెక్క లేదా లోహపు కోత పలకలను మాత్రమే ఉపయోగించాలి.

ప్లాస్టిక్ నీటి సీసాలు: ఫ్రిజ్‌లో పెట్టుకోవడానికైనా, తాగడానికైనా ఒకే ప్లాస్టిక్ సీసాను ఎక్కువ కాలం ఉపయోగించడం శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. రోజుల తరబడి వాడటం వల్ల ప్లాస్టిక్ విచ్ఛిన్నమై, అందులోని రసాయనాలు నీటిలో కరుగుతాయి. త్రాగునీటిని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ గాజు, ఉక్కు లేదా రాగి సీసాలను మాత్రమే వాడటం ఉత్తమం.