స్వార్థం కోసం పార్టీ మారితే ప్రజలు ఆదరించరు

వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారితే ప్రజలు ఆదరించరు అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అవంతి శ్రీనివాస్ ను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం. ఈ నెల11న ఢిల్లీలో తన వెంట ఉన్న అవంతి కొన్ని గంటల్లోనే జగన్ గూటికి చేరారన్నారు. ప్రలోభాలు, బెదిరింపులకు లొంగిపోయారని ఆరోపించారు. ఆమంచి పార్టీ మారగానే చీరాలలో నిరసనలు వెల్లువెత్తాయి.. టీడీపీ కార్యకర్తల్లో కసికి ఇది నిదర్శనమని అన్నారు. జగన్, కేటీఆర్ నాటకం దేశం మొత్తం తెలిసిపోయిందన్నారు బాబు. […]

స్వార్థం కోసం పార్టీ మారితే ప్రజలు ఆదరించరు
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2019 | 1:11 PM

వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారితే ప్రజలు ఆదరించరు అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అవంతి శ్రీనివాస్ ను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం. ఈ నెల11న ఢిల్లీలో తన వెంట ఉన్న అవంతి కొన్ని గంటల్లోనే జగన్ గూటికి చేరారన్నారు. ప్రలోభాలు, బెదిరింపులకు లొంగిపోయారని ఆరోపించారు. ఆమంచి పార్టీ మారగానే చీరాలలో నిరసనలు వెల్లువెత్తాయి.. టీడీపీ కార్యకర్తల్లో కసికి ఇది నిదర్శనమని అన్నారు. జగన్, కేటీఆర్ నాటకం దేశం మొత్తం తెలిసిపోయిందన్నారు బాబు. అందుకే ఏ పార్టీతో జత కట్టడం లేదంటూ విమర్శించారు. టీడీపీ ధర్మపోరాటంలో చిత్తశుద్ధి ఉన్న కారణంగానే.. 22 పార్టీలు అండగా నిలిచాయన్నారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు బాబు. దేశంలో ఎన్నికలకు ముందు కూటమి సాధ్యం కాదన్నారు.

కాగా.. ఒక ఎమ్మెల్యే అవినీతి వల్లే బీజేపీ, టీడీపీకి మధ్య చెడిందని అన్నారు ఎంపీ అవంతి శ్రీనివాస్. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు బంధుప్రీతి, అవినీతియే కారణమని మండిపడ్డారు. ఎన్నికల ముందు స్కీమ్ లు పెడితే ఓట్లు రాలవని విమర్శించారు అవంతి.