మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. లిక్కర్ కొనే వారి వేలిపై సిరా గుర్తు.. రీజన్ ఇదే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అయితే ఈ క్రమంలో అత్యవసర సేవలను మినహాయించి అనేక వాటిపై నిషేధం విధించింది. అందులో భాగంగా మద్యం షాపులను కూడా మూసివేసింది. తాజాగా గత వారం కొన్నింటిని సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా మద్యం షాపులకు కూడా మినహాయింపునిచ్చింది. దీంతో గత సోమవారం నుంచి మద్యం షాపులు అనేక రాష్ట్రాల్లో తెరుచుకున్నాయి. […]

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. లిక్కర్ కొనే వారి వేలిపై సిరా గుర్తు.. రీజన్ ఇదే..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 08, 2020 | 12:38 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అయితే ఈ క్రమంలో అత్యవసర సేవలను మినహాయించి అనేక వాటిపై నిషేధం విధించింది. అందులో భాగంగా మద్యం షాపులను కూడా మూసివేసింది. తాజాగా గత వారం కొన్నింటిని సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా మద్యం షాపులకు కూడా మినహాయింపునిచ్చింది. దీంతో గత సోమవారం నుంచి మద్యం షాపులు అనేక రాష్ట్రాల్లో తెరుచుకున్నాయి. అయితే దాదాపు నలభై రోజులుగా మద్యం దొరక్కపోవడంతో.. మద్యం ప్రియులు ఒక్కసారిగా దుకాణాలకు పోటెత్తుతున్నారు. దీంతో లిక్కర్ షాపులు కిక్కిరిసి పోకుండా మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

లిక్కర్ కొనగోలు చేసిన వారే మళ్లీ వెళ్లి కొనుక్కోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రహించిన సర్కార్.. ఇక మద్యం కొనుగోలుదారుల చేతి వేళ్లపై సిరా గుర్తు వేయాలని హోషంగాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.నిర్ణయించింది. జిల్లాలో లిక్కర్ బాటిళ్లు కొంటున్న వారి పేర్లు, అడ్రస్, మొబైల్ నంబర్లను రిజిస్టర్ చేస్తోంది. అంతేకాదు వారి చేతి వేలికి సిరా గుర్తు వేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఒకసారి మద్యం కొన్న వారు.. మళ్లీ మళ్లీ దుకాణానికి రాకుండా ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారి తెలిపారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో మద్యం దుకాణాలకు కొన్నింటికి మాత్రమే అనుమతించామని.. మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు కొనుగోలుదారులకు సిరాగుర్తు పెట్టే పద్ధతి అమలు చేస్తున్నామన్నారు.