వైభవంగా పెద్దగట్టు లింగమంతుల జాతర

యాదవ కులస్థులు రెండేళ్లకోసారి సంప్రదాయంగా జరుపుకునే లింగమంతుల జాతర బయ్యారంలో అట్టహాసంగా జరిగింది. పెద్దగట్టు లింగమంతుల జాతరను పురస్కరించుకుని యాదవ కులస్థులు ఐదు రోజులుగా బయ్యారం పాకాల ఏటి ఒడ్డు సమీపాన ఉన్న లింగమంతుల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా తొలిరోజు నవగ్రహాల నది జలహారం, ఊరేగింపు.. మరుసటిరోజు ధాన్య దివాసం, పుష్పాదివాసం, మూడో రోజు జలనివాసం, పంచామృతాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం నాడు ఆలయం నందు నవగ్రహ విగ్రహ‌ ప్రతిష్ఠ జరిపారు. […]

వైభవంగా పెద్దగట్టు లింగమంతుల జాతర
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:18 PM

యాదవ కులస్థులు రెండేళ్లకోసారి సంప్రదాయంగా జరుపుకునే లింగమంతుల జాతర బయ్యారంలో అట్టహాసంగా జరిగింది. పెద్దగట్టు లింగమంతుల జాతరను పురస్కరించుకుని యాదవ కులస్థులు ఐదు రోజులుగా బయ్యారం పాకాల ఏటి ఒడ్డు సమీపాన ఉన్న లింగమంతుల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా తొలిరోజు నవగ్రహాల నది జలహారం, ఊరేగింపు.. మరుసటిరోజు ధాన్య దివాసం, పుష్పాదివాసం, మూడో రోజు జలనివాసం, పంచామృతాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం నాడు ఆలయం నందు నవగ్రహ విగ్రహ‌ ప్రతిష్ఠ జరిపారు. సోమవారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో పాటు అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. జాతరను పురస్కరించుకుని యాదవ కులస్థులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.