క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టిన పేటీఎం

ఇ-కామర్స్ కంపెనీ పేటీఎం తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. పేటీఎం ఫస్ట్ కార్డు పేరుతో క్రెడిట్ కార్డును విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. సిటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు పేటీఎం తెలిపింది. క్రెడిట్ కార్డుపై వార్షిక ఫీజు రూ. 500 వసూలు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ కార్డు ద్వారా సంవత్సరానికి రూ. 50,000 పైగా వాడుకున్న కస్టమర్లకు వార్షిక ఫీజు మినహాయించింది. పేటీఎం యాప్ ద్వారా వినియోగదారులు పేటీఎం ఫస్ట్ కార్డు కోసం దరఖాస్తు […]

క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టిన పేటీఎం
Follow us

| Edited By:

Updated on: May 14, 2019 | 6:39 PM

ఇ-కామర్స్ కంపెనీ పేటీఎం తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. పేటీఎం ఫస్ట్ కార్డు పేరుతో క్రెడిట్ కార్డును విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. సిటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు పేటీఎం తెలిపింది. క్రెడిట్ కార్డుపై వార్షిక ఫీజు రూ. 500 వసూలు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ కార్డు ద్వారా సంవత్సరానికి రూ. 50,000 పైగా వాడుకున్న కస్టమర్లకు వార్షిక ఫీజు మినహాయించింది. పేటీఎం యాప్ ద్వారా వినియోగదారులు పేటీఎం ఫస్ట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.