అలా శిక్ష.. ఇలా బెయిల్.. లక్కీ పాయల్

నెహ్రు-గాంధీ కుటుంబంపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కంటెంట్ ప్రచురించిన బాలీవుడ్ నటి పాయల్ రోహ్తగికి బెయిల్ లభించింది. 25 వేల రూపాయల చొప్పున రెండు బెయిలు బాండ్లపై రాజస్థాన్ లోని అదనపు జిల్లా కోర్టు జడ్జి ఆమెకు మంగళవారం బెయిలు మంజూరు చేశారు. తన కంటెంట్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉందంటూ పాయల్ పై ఐటీ చట్టం, ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో […]

అలా శిక్ష.. ఇలా బెయిల్.. లక్కీ పాయల్
Follow us

|

Updated on: Dec 17, 2019 | 5:56 PM

నెహ్రు-గాంధీ కుటుంబంపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కంటెంట్ ప్రచురించిన బాలీవుడ్ నటి పాయల్ రోహ్తగికి బెయిల్ లభించింది. 25 వేల రూపాయల చొప్పున రెండు బెయిలు బాండ్లపై రాజస్థాన్ లోని అదనపు జిల్లా కోర్టు జడ్జి ఆమెకు మంగళవారం బెయిలు మంజూరు చేశారు. తన కంటెంట్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉందంటూ పాయల్ పై ఐటీ చట్టం, ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆమెను 8 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపింది. మొదట ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కానీ రోహ్తగి తరఫు లాయర్ భూపేంద్ర సక్సేనా తాజాగా జిల్లా జడ్జి కోర్టులో బెయిలు పిటిషన్ వేశారు. అయితే ఆ జడ్జి సెలవులో ఉండడంతో.. ఆ బెయిల్ దరఖాస్తును అదనపు జిల్లా జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. ఈ కోర్టులో ఆమెకు బెయిల్ లభించడం విశేషం. గుజరాత్.. అహ్మదాబాద్ లోని రోహ్తగి నివాసం నుంచి రాజస్థాన్ పోలీసులు ఆమెను ఈనెల 15 న అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అయితే వారి శ్రమ వృధా అయింది.