Breaking News
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపలేం-సీఎం కేసీఆర్‌. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఆర్టీసీకి ఆర్థిక భారం మోసే శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం-కేసీఆర్‌
  • హైదరాబాద్‌: నేడు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ
  • చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందనడం సమంజసం కాదు. ఇలాంటి ప్రయోగాల్లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం సాధారణం. అంతమాత్రాన చంద్రయాన్‌-2 విఫలమైందనడం సరికాదు -కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
  • ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉపసంహరణపై ప్రియాంకాగాంధీ స్పందన. రాజకీయాల్లో భాగంగానే సెక్యూరిటీ తొలగించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి-ప్రియాంక
  • తాజ్‌మహల్‌ పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసిన విదేశీ యాత్రికులు. రష్యాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ సరైన పరిష్కారం కాదు-మమతాబెనర్జీ. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తాత్కాలిక ఉపశమనమే. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేయవు-మమత
  • సియాచిన్‌పై పాకిస్తాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. సియాచిన్‌ వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడంలేదన్న పాక్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. గౌహతి, షిల్లాంగ్‌లో కంపించిన భూమి. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

ప్యాసింజర్‌ ఆటోమొబైల్ సేల్స్ ఢమాల్!

Passenger Vehicle Sales Plunge 31 percent, ప్యాసింజర్‌ ఆటోమొబైల్ సేల్స్ ఢమాల్!

దేశంలో ఆటోమొబైల్ విక్రయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా తొమ్మిదో నెల కూడా ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు పడిపోయాయి. జులైలో కేవలం 2,00,790 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2018లో జులైలో విక్రయమైన 2,90,931 యూనిట్లతో పోలిస్తే ఇది 30.98శాతం తక్కువ అని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫాక్చరర్స్‌(సియామ్‌) వెల్లడించింది.

దేశీయ కార్ల విక్రయాలు 35.95శాతం తగ్గి 1,22,956 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది జులై నెలలో ఈ విక్రయాలు 1,91,979 యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 జులై నెలలో 18,17,406యూనిట్ల ద్విచక్రవాహనాలు అమ్ముడవగా.. గత నెలలో ఆ సంఖ్య 16.82శాతం తగ్గి 15,11,692 యూనిట్లుగా ఉంది. కమర్షియల్‌ వాహనాల విక్రయాలు కూడా 25.71శాతం తగ్గి 56,866 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని కేటగిరిల్లో కలిపి జులైలో వాహన విక్రయాలు 18.71శాతం తగ్గాయి.

అయితే… ఆటోమొబైల్‌ రంగంలో ఇంత తక్కువ స్థాయిలో అమ్మకాలు జరగడం 19ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా 2000 సంవత్సరం డిసెంబరులో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 35శాతం పడిపోయాయి. గిరాకీ లేకపోవడంతో ఆటోమొబైల్‌ సంస్థల వద్ద నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో ఉత్పత్తిని తగ్గించాలని కంపెనీలు భావిస్తున్నాయి. మరోవైపు ఆటోమొబైల్‌ వాహనాలపై జీఎస్‌టీని తగ్గించాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.