బంగీ జంప్ చేసిన బోండా ఉమా.. పార్టీ జంప్ చేస్తారా?

బోండా ఉమామహేశ్వరరావు టీడీపీని ఏమన్న అంటే ఒంటికాలుపై లేచే తెలుగు తమ్ముడు. ఎన్నికల ఫలితాల తర్వాత దూకుడుకు బ్రేక్ పడింది. దీంతో బోండా సైలెంట్ అయ్యారు. ఈ బెజవాడ తమ్ముడి వాయిస్ లో బేస్ కూడా తగ్గిపోయింది. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఇటు కేడర్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. అప్పటినుంచే టీడీపీ హైకమాండ్ తో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు బోండా. బాబు అధ్యక్షతన ఓటమిపై జరిగిన రివ్యూ మీటింగ్ కు కూడా బోండా డుమ్మా కొట్టారు. విజయవాడలోనే ఉన్నా భేటీకి అటెండ్ కాలేదు. దీంతో బోండా పార్టీ మారుతారనే ప్రచారం అప్పట్నుంచే జరుగుతోంది.

ఏపీలో ఆపరేషన్ స్టార్ట్ చేసిన బీజేపీ నేతలు ఈ ఆగస్టులోనే అసలు సినిమా బాబుకు చూపిస్తామని గతంలో స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇప్పటికే నలుగురు ఎంపీలు సైకిల్ దిగిపోగా..ఇప్పుడు కొత్తగా మరికొందరు పార్టీ మారుతారనే ప్రచారం ఏపీ పొలిటికల్ సెంటర్లో చక్కర్లు కొడుతోంది. ఎంపీ కేశినేని కూడా బీజేపీలో చేరుతానే టాక్. ఇటీవల నానితో బోండా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే వీళిద్దరు సైకిల్ దిగుతారనే ప్రచారం బెజవాడలో హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. ఫారిన్ టూర్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బోండా అక్కడ బంగీ జంప్ చేసిన విజువల్స్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఏపీకి తిరిగిరానున్న బోండా బంగీ జంప్ లాగే పార్టీ జంప్ చేస్తారా…అనే ప్రచారం ఏపీలో హల్ చల్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *