శబరిమల దర్శనం.. ఒకసారి 50 మందికి మాత్రమే అనుమతి..

లాక్ డౌన్ 5.0 సడలింపుల నేపధ్యంలో దేశవ్యాప్తంగా ప్రార్ధనా మందిరాలు, ఆలయాలు జూన్ 8వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు, రెస్టారెంట్లు, మాల్స్ ను జూన్ 9 నుంచి..

శబరిమల దర్శనం.. ఒకసారి 50 మందికి మాత్రమే అనుమతి..
Follow us

|

Updated on: Jun 05, 2020 | 7:43 PM

లాక్ డౌన్ 5.0 సడలింపుల నేపధ్యంలో దేశవ్యాప్తంగా ప్రార్ధనా మందిరాలు, ఆలయాలు జూన్ 8వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు, రెస్టారెంట్లు, మాల్స్ ను జూన్ 9 నుంచి పునః ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఇక శబరిమల ఆలయంలోకి వెళ్ళడానికి ఒకసారి 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని వెల్లడించారు. అంతేకాకుండా అధిక సంఖ్యలో వచ్చే భక్తులను వర్చువల్ క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా నియంత్రిస్తామని చెప్పారు.

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు నో ఎంట్రీ!