ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్ దొంగ ట్రీట్మెంట్..! పేరెంట్స్ ధర్నా

పేషెంట్ల ప్రాణభయాన్ని ఆసరా చేసుకున్న కొన్ని ప్రయివేటు వైద్యశాలలు తప్పుడు పనులకు పాల్పడుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి లేనిపోని భయాలు, అపోహలతో అందినంత దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఒంగోలులోని ఓ ప్రయివేటు వైద్యశాలలో కూడా ఇదే విధంగా మోసం చేసి ఒక లక్షా 70 వేల రూపాయలు వసూలు చేశారంటూ ఓ చిన్నారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సియస్‌ పురం గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారికి జ్వరం రావడంతో ఒంగోలు అంజయ్య రోడ్డులోని పిల్లల […]

ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్ దొంగ ట్రీట్మెంట్..! పేరెంట్స్ ధర్నా
Follow us

|

Updated on: Oct 15, 2020 | 10:39 AM

పేషెంట్ల ప్రాణభయాన్ని ఆసరా చేసుకున్న కొన్ని ప్రయివేటు వైద్యశాలలు తప్పుడు పనులకు పాల్పడుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి లేనిపోని భయాలు, అపోహలతో అందినంత దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఒంగోలులోని ఓ ప్రయివేటు వైద్యశాలలో కూడా ఇదే విధంగా మోసం చేసి ఒక లక్షా 70 వేల రూపాయలు వసూలు చేశారంటూ ఓ చిన్నారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సియస్‌ పురం గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారికి జ్వరం రావడంతో ఒంగోలు అంజయ్య రోడ్డులోని పిల్లల ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ప్రారంభించారు. అన్ని టెస్టులు చేసిన తరువాత పాపకు ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయని ఆస్పత్రిలోని డాక్టర్లు తెలిపారు. వెంటనే ప్లేట్‌లెట్లను కూడా ఎక్కించారు. వారం రోజులుగా పాప పరిస్థితి మెరుగవుతోందని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అయితే తాజాగా బుధవారం పాప రక్తంలో ప్లేట్‌లెట్ల శాతం బాగా తగ్గిపోయిందని.. వెంటనే గుంటూరులోని మరో ప్రయివేటు ఆసుపత్రికి తరలించి అక్కడ బోన్‌మారో పరీక్షలు చేయించాలని పాప తల్లిదండ్రులకు డాక్టర్లు సూచించారు. అందుకు గాను మరో 80 వేల దాకా ఖర్చవుతుందని తెలిపారు.

దీంతో ఖంగుతిన్న పాప తల్లిదండ్రులు వెంటనే గుంటూరు వెళ్ళేందుకు సిద్దమయ్యారు. అయితే.. ఎందుకయినా మంచిదంటూ ఆస్పత్రితో సంబంధం లేకుండా మరో ల్యాబ్‌లో పాపకు ప్లేట్‌లేట్లు కౌంట్‌ చేయించారు. అయితే అనూహ్యంగా అక్కడ ప్లేట్‌లెట్ల సంఖ్య 4 లక్షలకు పైగానే ఉందని రిపోర్టు వచ్చింది… మరో ల్యాబ్‌లో కూడా పరీక్ష చేయించారు. అక్కడ కూడా ప్లేట్‌లెట్ల సంఖ్య 4 లక్షలకు పైగానే వచ్చింది. దీంతో తమను ప్లేట్‌లెట్ల పేరుతో ఒంగోలు పిల్లల ఆసుపత్రి డాక్డర్లు మోసం చేశారంటూ పాప తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం పాప తల్లిదండ్రుల ఆరోపణల్లో వాస్తవం లేదంటోంది. పాపకు చికిత్స అనంతరం ప్లేట్‌లెట్లు పెరిగాయని, అయితే తిరిగి వారం రోజుల తరువాత అనూహ్యంగా తగ్గిపోవడంతో ఎందుకైనా మంచిదని బోన్‌మారో పరీక్షలకు సిఫార్సు చేశామంటున్నారు. అంతేకానీ తమ ఆసుపత్రిలో ఎలాంటి మోసం జరగలేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో