సూర్యాపేటలో పేలుడు..ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పేలుడు కలకలం రేపింది. ఓ పాత ఐరన్ స్క్రాప్ దుకాణంలో బ్లాస్ట్ జరిగింది. ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పట్టణంలోని వెంకట సాయి దుకాణంలో పాత ఇనుప, ప్లాస్టిక్‌ సామాను సేకరించి ముక్కలుగా చేసి ఎగుమతి చేస్తుంటారు. ఇదే క్రమంలో ముగ్గురు కార్మికులు పాత ప్లాస్టిక్ బాకెట్స్‌ను కటింగ్‌ మీషన్‌పై కట్‌ చేస్తుండగా, పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి పైకప్పు రేకులు ఎగిరి పడ్డాయి. గోడ కూలిపోయింది. కాగా, […]

సూర్యాపేటలో పేలుడు..ఒకరు మృతి
Follow us

|

Updated on: Sep 13, 2019 | 3:24 PM

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పేలుడు కలకలం రేపింది. ఓ పాత ఐరన్ స్క్రాప్ దుకాణంలో బ్లాస్ట్ జరిగింది. ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పట్టణంలోని వెంకట సాయి దుకాణంలో పాత ఇనుప, ప్లాస్టిక్‌ సామాను సేకరించి ముక్కలుగా చేసి ఎగుమతి చేస్తుంటారు. ఇదే క్రమంలో ముగ్గురు కార్మికులు పాత ప్లాస్టిక్ బాకెట్స్‌ను కటింగ్‌ మీషన్‌పై కట్‌ చేస్తుండగా, పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి పైకప్పు రేకులు ఎగిరి పడ్డాయి. గోడ కూలిపోయింది. కాగా, ప్రమాదంలో రామచంద్ర సాహూ అనే కార్మికుడు స్పాట్‌లో ప్రాణాలు కొల్పోయాడు. మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. మృతుడు రామచంద్ర సాహు మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

గాయపడిన వారిలో ఒకరిని యూపీకి చెందిన సల్మాన్ గా, మరొకరిని రామ్ కోటి తండాకు చెందిన బుచ్చమ్మగా గుర్తించారు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, సల్మాన్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.ఈ పేలుడుతో సూర్యాపేట పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమీపంలోని దుకాణాలకు చెందిన వారు భయంతో పరుగులు పెట్టారు. బాధిత కార్మికులు రోజూ మాదిరిగానే ప్లాస్టిక్‌ డబ్బాలను కట్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్ధంతో ఆ ప్రాంతమంత దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏ జరుగుతుందో అర్ధం కాలేదని..కాసేపటి తర్వాత తేరుకుని చూస్తే.. ఒకరు చనిపోయారని, మరో ఇద్దరు రక్తపు మడుగులో పడివున్నారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీంలతో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ దుకాణం యజమాని నాగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. కట్టింగ్‌ మీషన్‌ లోకల్‌ మేడ్‌ కావడంతో హీటెక్కి పేలి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఘటనా స్థలంలో సేకరించిన పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు…కెమికల్ డబ్బాల వల్ల ప్రమాదం జరిగిందా..? లేక పేలుడు పదార్థాల వల్ల జరిగిందా..అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.