Viral Video: సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న బాలుడి డ్యాన్స్.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..

Viral Video: సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ఫోటోలు, వీడియోలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఆఫీసు, ఇళ్లు, ఇతర పనుల కారణంగా...

Viral Video: సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న బాలుడి డ్యాన్స్.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..
Dance

Updated on: Jun 11, 2021 | 5:28 AM

Viral Video: సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ఫోటోలు, వీడియోలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఆఫీసు, ఇళ్లు, ఇతర పనుల కారణంగా ఒత్తిడిగా ఫీల్ అవుతున్న సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌‌గా వస్తున్న ఫీడ్‌లు వాటన్నింటినీ పటాపంచలు చేసి రిలాక్స్‌ని ఇస్తాయి. అలాంటి వీడియోను ఒకదానిని అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాలర్ రెక్స్ చాప్‌మన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూస్తే కచ్చితంగా వావ్ అంటారు.

ఒక నిమిషం పాటు ఉన్న ఈ వీడియో క్లిప్‌లో చొక్కా, లాగు, స్నీకర్స్ ధరించి ఉన్న ఓ చిన్న పిల్లవాడు.. డ్యాన్సర్స్ గ్రూప్‌తో కలిసి ఎంతో చక్కగా డ్యాన్స్ వేస్తున్నాడు. పిల్లవాడు చూడటానికి చాలా చిన్న వయసు కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నా.. డ్యాన్స్ మాత్రం అద్భుతంగా వేశాడు. డ్యాన్సర్లతో సమానంగా స్టెప్ టూ స్టెప్ వారితో సమానంగా వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ బాలుడు డ్యాన్స్ చేస్తుండగా.. కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను ఇప్పుడు చాప్‌మన్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఇప్పుడు అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సైతం బాలుడి డ్యాన్స్‌కు ఫిదా అయిపోతున్నారు. తాము చూసిన వీడియోలన్నింటిలోనూ ఇది గొప్పదని పేర్కొంటున్నారు. కాగా, ఈ వీడియోకు ఒక్క రోజు వ్యవధిలోనే 1.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే లక్షకు పైగా లైక్‌లు, లక్షన్నరకు పైగా రీట్వీట్ చేశారు నెటిజన్లు.

Twitter Video:

Also read:

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్… జూలై 1 నుంచి సవరించిన జీతాలు..

IRCTC Ticket Booking: రైలు టికెట్ బుక్కింగులో డిస్కౌంట్ పొందడం ఎలాగో తెలుసా..! అయితే ఇలా చేయండి..!