Lion vs Tiger Viral Video: లయన్ వర్సెస్ టైగర్.. వారెవ్వా ఎంత చూడముచ్చటగా ఉన్నాయో..!

|

May 24, 2021 | 10:32 PM

Viral Video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని కడుపుబ్బా నవ్విస్తుంటాయి.

Lion vs Tiger Viral Video: లయన్ వర్సెస్ టైగర్.. వారెవ్వా ఎంత చూడముచ్చటగా ఉన్నాయో..!
Viral Video
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు విలువైన సమాచారం ఉంటుంది. ఇప్పుడు మనం ఆసక్తికరమైన వీడియో గురించి చెప్పుకోబోతున్నాం. సాధారణంగా మనం ఇప్పటి వరకు జంతువుల పిల్లలు కొట్టుకోవడం ఎన్నోసార్లు చూసి ఉంటాం. తమ తమ తోబుట్టువులతోనే సరదాగా ఆడుకోవడం, సీరియస్‌గా ఫైటింగ్ చేయడం వంటి వీడియోలను కోకొల్లలుగా వీక్షించి ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోలో సోషల్ మీడియాలో ఒక బాగా ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ వీడియోలో ఒకే జాతికి చెందిన జంతువుల పిల్లలు కొట్టుకోవడం లేదు.. మృగ రాజు సింహం, పెద్దపులి పిల్లలు ఫైటింగ్ చేసుకున్నాయి. ఆ రెండు పిల్లల ఫైటింగ్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది.

బ్యూటెంగ్‌బీడెన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సింహం పిల్ల, పులి పిల్ల రెండూ పోట్లాడుకుంటున్నాయి. పంజాలతో కొట్టుకుంటూ.. పచ్చిక బయలుపై దొర్లుతున్నాయి. అయితే ఆ రెండూ సరదాగా ఆడుకుంటున్నట్లు వీడియోలో స్పష్టం అవుతోంది. చూడ ముచ్చటగా ఉన్న సింహం పిల్ల, పులి పిల్ల ఫైటింగ్‌ను లయన్ వర్సెస్ టైగర్ పేరుతో క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బ్యూటెంగ్‌బీడెన్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాదారులు. మొత్తం 42 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోను ట్విట్టర్లో 46,000 మంది వీక్షించగా.. 4,000 లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజనర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎంత క్యూట్‌గా ఉన్నాయో’ అంటూ కొందరు స్పందించగా.. వీటి ఫైటింగ్ చూడముచ్చటగా ఉందంటూ వేరొకరు కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియో మీరూ చేసేయండి.

Viral Video:


Also read:

మంగళవారం నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

Andhrapardesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతుల‌కు గుడ్ న్యూస్.. మంగ‌ళ‌వారం వారి ఖాతాల్లోకి నేరుగా డ‌బ్బ జ‌మ‌

Indian Railways: ఉసురు కోల్పోతున్న జనాళికి ఊపిరి పోస్తూ రికార్డు పరుగులు తీస్తున్న మన రైలు బళ్ళు..