
Funny Video: బావా మరదళ్ల సరదాలు, బావా, బావమరుదల వ్యవహారలు ఓ రేంజ్లో ఉంటాయనే విషయం తెలిసిందే. ఇక కొత్త పెళ్లికొడుక్కి మరదళ్లు ఎక్కువగా ఉంటే.. అతని పని అయిపోయినట్లే అని భావించాలంటే. ఎందుకుంటే అంతలా చెడుగుడు ఆడేసుకుంటారు మరి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి వేడుక సందర్భంగా పెళ్లి కుమారుడికి బావమరుదులు కానీ, మరదళ్లు కానీ ఉన్నట్లయితే.. ఆ పెళ్లి కొడుక్కి సంబంధించి విలువైన వస్తువులను తీసి దాస్తారు. అలా కాసేపు తమ కొత్త బావను ఆటపట్టించి.. అతని నుంచి కొంత మొత్తం సొమ్మును వసూలు చేస్తారు.
ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోలో వధువు చెల్లెల్లు.. తమ బావ బూట్లను లాక్కునేందుకు తెగ పోటీ పడ్డారు. ఒకరిని మించి ఒకరు వాటిని తీసుకునేందుకు పోటీ పడి ఏకంగా పోరాటమే సాగించారు. చివరికి అతని నుంచి బూట్లు లాగేసుకున్నారు. కానీ, వారిలో వారే ఆ బూట్లకోసం పోటీ పడ్డారు. ఈ ఘటనను అంతా వీడియో తీసిన పెళ్లికి వచ్చిన అతిథులు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్గా మారింది. వధువు చెల్లెల పోరాటం చూసిన నెటిజన్లు కడపుబ్బా నవ్వుకుంటున్నారు. మరి అంతలా నవ్వు పుట్టిన వీడియోను ఆలస్యం చేయకుండా మీరూ చూసేయండి..
Viral Video:
Also read:
Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్లలో ఇవాళ సిల్వర్ రేట్స్ ఇలా..