హోటల్‌ బిల్లు రూ.20 వేలు దాటితే ట్యాక్స్ !

రూ .20,000 పైన ఉన్న హోటల్ బిల్లులు, రూ .50 వేలకు పైగా జీవిత బీమా చెల్లింపులు, సంవత్సరానికి 1,00,000 రూపాయలకు పైగా పాఠశాల లేదా కళాశాల ఫీజుల చెల్లింపులు త్వ‌ర‌లో ఆదాయపు పన్ను శాఖ స్కానర్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

హోటల్‌ బిల్లు రూ.20 వేలు దాటితే ట్యాక్స్  !
Follow us

|

Updated on: Aug 14, 2020 | 5:11 PM

రూ .20,000 పైన ఉన్న హోటల్ బిల్లులు, రూ .50 వేలకు పైగా జీవిత బీమా చెల్లింపులు, సంవత్సరానికి 1,00,000 రూపాయలకు పైగా పాఠశాల లేదా కళాశాల ఫీజుల చెల్లింపులు త్వ‌ర‌లో ఆదాయపు పన్ను శాఖ స్కానర్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు 1,00,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులు, ఆభరణాలు, పెయింటింగ్‌లు, డీమాట్ ఖాతాలు, బ్యాంక్ లాకర్ల కొనుగోలు కూడా స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ లావాదేవీల (ఎస్‌ఎఫ్‌టి) లో చేర్చడానికి ప్రతిపాదించబడ్డాయి.

అలాగే ప్రొప‌ర్టీ ట్యాక్స్ చెల్లింపు రూ.20 వేలకు, ప‌వ‌ర్ బిల్స్ చెల్లింపులు రూ.20 వేలకు మించితే ఆ వివరాలు కూడా గ‌రర్న‌మెంట్‌కు అందుతాయని, ఇవన్నీ సదరు వ్యక్తి పన్ను చెల్లింపు స్టేట్‌మెంట్‌ (ఫామ్‌ 26 ఏఎస్‌)లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఓ ప్రకటనలో వివ‌రించింది. గతంలో ఎక్కువ‌ విలువ కలిగిన లావాదేవీల్లో ఎక్కువ భాగం డీమ్యాట్‌ ఖాతాలు లేదా బ్యాంకులు అనుసంధానమై ఉండేవి. కానీ ప్ర‌జంట్ పన్ను వసూళ్లలో ప్రతి ఒక్కరిపై ఫోక‌స్ పెట్టాల‌న్న‌ లక్ష్యంతో కేంద్రం తాజా ప్రతిపాదన చేసింది.

Also Read : ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు పంపిణీ