ముక్కుకు సర్జరీ చేస్తే.. యవ్వనం బోనస్..!

అందంగా కనిపించాలంటే అందమైన ముక్కు తప్పనిసరి. సాధారణంగా ముక్కు అందవికారంగా కనిపిస్తే రైనోప్లాస్టీ (కాస్మోటిక్‌ నోస్‌ సర్జరీ) సర్జరీ చేయించుకోవడం చూస్తుంటాం. ముక్కు సరిగా లేకపోతే ఎంత అందంగా ఉన్నా..ముఖం అసౌకర్యంగా కనిపిస్తుంది. ముక్కుకు సర్జరీ చేసుకోవడం ద్వారా ముఖం అందంగా కనిపించడమే కాకుండా మరో ఉపయోగం కూడా ఉందట. అవును..ముక్కు సర్జరీ చేయించుకున్నవారిలో అధికమంది మూడేళ్ల యవ్వనంతో కనిపిస్తారట. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. రైనోప్లాస్టీ (కాస్మోటిక్‌ నోస్‌ సర్జరీ) చేయించుకున్న […]

ముక్కుకు సర్జరీ చేస్తే.. యవ్వనం బోనస్..!
Follow us

| Edited By:

Updated on: Jan 29, 2020 | 9:08 PM

అందంగా కనిపించాలంటే అందమైన ముక్కు తప్పనిసరి. సాధారణంగా ముక్కు అందవికారంగా కనిపిస్తే రైనోప్లాస్టీ (కాస్మోటిక్‌ నోస్‌ సర్జరీ) సర్జరీ చేయించుకోవడం చూస్తుంటాం. ముక్కు సరిగా లేకపోతే ఎంత అందంగా ఉన్నా..ముఖం అసౌకర్యంగా కనిపిస్తుంది. ముక్కుకు సర్జరీ చేసుకోవడం ద్వారా ముఖం అందంగా కనిపించడమే కాకుండా మరో ఉపయోగం కూడా ఉందట. అవును..ముక్కు సర్జరీ చేయించుకున్నవారిలో అధికమంది మూడేళ్ల యవ్వనంతో కనిపిస్తారట. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు.

రైనోప్లాస్టీ (కాస్మోటిక్‌ నోస్‌ సర్జరీ) చేయించుకున్న కొంతమంది యువతులు, మహిళలకు సంబంధించి..సర్జరీకి ముందు, ఆ తర్వాత సుమారు 100 ఫొటోలను కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) ద్వారా పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన రాబర్ట్‌ డార్ఫ్‌మన్‌ వెల్లడించారు. ముఖ సౌందర్యంలో భాగంగా చేయించుకునే రైనోప్లాసీ సర్జరీ అత్యంత ప్రాచుర్యం పొందింది. అయితే ఈ సర్జరీ వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో చాలా మందికి అవగాహన ఉండదని రాబర్ట్‌ అభిప్రాయపడ్డారు.