‘నో..నాట్ టామ్ హాంక్స్ ప్లీజ్’.. ట్విటర్ యూజర్ల ఖండన

తాను, తన భార్య రీటా విల్సన్ కరోనా వైరస్ బారిన పడ్డామని, టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చిందని ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన వార్తలపై హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

'నో..నాట్ టామ్ హాంక్స్ ప్లీజ్'.. ట్విటర్ యూజర్ల ఖండన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 12, 2020 | 1:23 PM

తాను, తన భార్య రీటా విల్సన్ కరోనా వైరస్ బారిన పడ్డామని, టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చిందని ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన వార్తలపై హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటిపై ఆయన  స్వయంగా ఓ స్టేట్ మెంట్ ఇస్తూ.. తమ దంపతులం జలుబుతో స్వల్పంగా బాధపడుతున్నామని, అలసిపోయామని పేర్కొన్నారు. మాకు ఒంటి నొప్పులు, స్వల్పంగా జ్వరం వచ్చాయి. అని వివరించిన ఆయన.. మాకు టెస్ట్ చేసి కరోనా వైరస్ పాజిటివ్ అని అంటున్నారు.. ఏదైనా.. మా ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తాం అని ఆయన ట్వీట్ చేశాడు. పాపులర్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ బయో పిక్ నేపథ్యంలో వార్నర్ బ్రదర్స్ తీస్తున్న మూవీ షూటింగ్ కోసం ప్రస్తుతం హాంక్స్, రీటా ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన ట్విటర్ చూసినవెంటనే ఇక ఆయన అభిమానులు, ట్విటర్ యూజర్లు తమ కామెంట్లతో సోషల్ మీడియాను నింపేశారు. మంచివాళ్లకు చెడ్డవాటిని ఎందుకు ఆపాదిస్తారని ఒకరంటే.. అసలు టామ్ హాంక్స్ లెజెండ్ అని, కరోనాపై  పోరాటం చేసి దానిపైనే సినిమా తీస్తాడని మరొకరు అన్నారు. కొందరు టామ్ నటించిన చిత్రపటాల వద్ద ప్రేయర్లు చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అటు వార్నర్ బ్రదర్స్ సంస్థ కూడా తమ టీమ్ లోని ఓ జంటకు కరోనా పాజిటివ్ అన్న విషయం తెలిసిందని, అయితే ఇది పూర్తిగా నిర్ధారణ కావలసి ఉందని, తమ చిత్రం షూటింగ్ యధావిధంగా జరుగుతుందని వివరించింది.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..