హిందీ భాషను వ్యతిరేకించేవారు దేశాన్ని ప్రేమించలేరు..!

No love for Hindi is no love for India: Tripura CM Biplab Kumar Deb, హిందీ భాషను వ్యతిరేకించేవారు దేశాన్ని ప్రేమించలేరు..!

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం హిందీ భాషపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ చర్చ తెరమీదకొచ్చింది. హిందీ భాషని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నట్లు దక్షిణ రాష్ట్రాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారయి.

మంగళవారం ఓ సందర్భంలో మాట్లాడుతున్న బిప్లబ్ దేబ్.. జాతీయ భాషను వ్యతిరేకించేవారు భారతీయులు కాదంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే తాను ఇంగ్లిష్‌కు వ్యతిరేకం కాదని, అదేవిధంగా హిందీని రుద్దడాన్ని సమర్థించడం లేదంటూ వివరించారు. జాతీయ భాషగా హిందీని వ్యతిరేకించేవారు.. దేశాన్ని ప్రేమించలేరని అన్నారు. మన దేశంలో అత్యధికులు మాట్లాడుతూ, అర్థం చేసుకోగలిగిన భాషగా హిందీని సమర్థిస్తానని తెలిపారు. మన దేశాన్ని ఆంగ్లేయులు రెండు వందల ఏళ్ల పాటు పరిపాలించి ఉండకపోతే, దేశంలోని అధికారిక వ్యవహారాల్లో ఇంగ్లిష్ భాష ఉపయోగం ఏమీ ఉండేది కాదన్నారు.

అధికారిక భాషల చట్టం, 1963 ప్రకారం కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటులో హిందీ, ఇంగ్లిష్ అధికార భాషలు. అయితే రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలు ప్రకారం 22 భాషలకు గుర్తింపు ఉంది. సెప్టెంబర్ 14న హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ భారత దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కోసం ఒక భాష ఉండటం చాలా ముఖ్యమని చెప్పిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *