లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Nifty ends around, లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ  స్టాక్‌ మార్కెట్లలో వడ్డీ రేట్ల తగ్గింపుపై భారీ ఆశలు నెలకొనడంతో సూచీలు పెరిగాయి. సెన్సెక్స్‌ 277 పాయింట్లు పెరిగి 36,976 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 10,948 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. రిజ్వరు బ్యాంక్‌ వరసగా నాలుగోసారి కూడా 25 బేస్‌ పాయింట్ల మేరకు వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించవచ్చనే ప్రచారం జరగడంతో షేర్లు దూసుకెళ్లాయి. చైనాపై కరెన్సీ గారడి చేస్తున్న దేశంగా అమెరికా ముద్ర వేయడం కూడా మార్కెట్లపై  ప్రభావం చూపింది. చైనా తన కరెన్సీని స్థిరీకరించేందుకు చర్యలు చేపట్టడం సానుకూల ప్రభావం చూపింది. కాగా… ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా వడ్డీ రేట్ల తగ్గింపుపై  పరపతి విధాన సమీక్ష కమిటీని కోరినట్లు సమాచారం.

నేటి మార్కెట్లో యస్‌బ్యాంక్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు ఒక దశలో 40శాతం లాభపడింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు భారీగా నష్టపోయాయి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *