తికమకపడ్డ ఎన్‌ఐఏ.. ప్రముఖ డాక్టర్‌కు సమన్లు

చిన్న తికమకతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. ఉగ్రవాదికి డాక్టర్ పంపిన మెసేజ్‌ను తప్పుగా అర్థం చేసుకున్న ఎన్‌ఐఏ సిబ్బంది ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని ప్రముఖ వైద్యుడు ఉపేంద్ర కౌల్‌కు నోటీసులు జారీ చేశారు. కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద నాయకుడు యాసిన్‌ మాలిక్‌, ఉపేంద్ర కౌల్‌ మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయని ఆ సంస్థ పొరబడింది. వివరాల్లోకి వెళ్తే.. కౌల్, మాలిక్‌కు పంపిన ఓ మెసేజ్‌లో ‘ఐఎన్‌ఆర్ 2.78’ అని రాసి ఉంది. […]

తికమకపడ్డ ఎన్‌ఐఏ.. ప్రముఖ డాక్టర్‌కు సమన్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2019 | 8:07 AM

చిన్న తికమకతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. ఉగ్రవాదికి డాక్టర్ పంపిన మెసేజ్‌ను తప్పుగా అర్థం చేసుకున్న ఎన్‌ఐఏ సిబ్బంది ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని ప్రముఖ వైద్యుడు ఉపేంద్ర కౌల్‌కు నోటీసులు జారీ చేశారు. కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద నాయకుడు యాసిన్‌ మాలిక్‌, ఉపేంద్ర కౌల్‌ మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయని ఆ సంస్థ పొరబడింది.

వివరాల్లోకి వెళ్తే.. కౌల్, మాలిక్‌కు పంపిన ఓ మెసేజ్‌లో ‘ఐఎన్‌ఆర్ 2.78’ అని రాసి ఉంది. ఐఎన్‌ఆర్ అంటే ఇంటర్నేషనలైజ్డ్‌ నార్మలైజ్డ్‌ రేషియో. అది రక్తం తీరును అంచనా వేసే ఒక పారామీటర్‌. ఈ విషయంలో పొరబడిన ఎన్‌ఐఏ సిబ్బంది దాన్ని రూ.2.78 కోట్లు హవాలా డబ్బుగా భావించి, ఆయనకు నోటీసులు పంపారు. దాంతో ఎన్‌ఐఏ కార్యాలయానికి హాజరైన ఉపేంద్ర కౌల్.. వివరణ ఇవ్వడంతో సిబ్బంది అనుమానం తీరింది. వెంటనే నోటీసులు వెనక్కి తీసుకొని, ఆయన్ను అక్కడి నుంచి వెనక్కి పంపేశారు.

దీనిపై కౌల్ మాట్లాడుతూ..‘ఒక వైద్యుడికి, రోగికి ఉన్న సంబంధమే నాకు, మాలిక్‌కు మధ్య ఉంది. 1995-96 మధ్యకాలంలో మాలిక్ గుండెలోని వాల్వ్‌ను మార్చడానికి హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చింది. ఆ తరువాత అతడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎప్పటికప్పుడు చెకప్‌ చేయాల్సి వచ్చింది’ అని తెలిపారు. ..‘అందరికి వైద్య పదజాలం తెలియాలని లేదని అందుకే ఎన్‌ఐఏ అధికారులు తప్పుగా భావించి ఉండొచ్చు అని అన్నారు. అయితే కశ్మీర్ పండిట్ అయిన ఉపేంద్ర దేశంలో ప్రముఖ గుండె వైద్య నిపుణుల్లో ఒకరు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు