పోలీస్ ‘కలుపు మొక్క’ పై కేసు.. సస్పెన్షన్ !

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులకు తోడ్పడ్డాడన్న ఆరోపణలపై అరెస్టయిన డీఎస్పీ దావేందర్ సింగ్ పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)  కేసు దాఖలు చేసింది. ఆయుధ చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ కేసు పెట్టారు. ఇతడ్ని సస్పెండ్ చేసినట్టు ఎన్ఐఎ వర్గాలు తెలిపాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీకి తరలిస్తూ సింగ్ శ్రీనగర్ లోని షోపియన్ ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనిపై మొత్తం 5 సెక్షన్ల కింద కేసు […]

పోలీస్ 'కలుపు మొక్క' పై కేసు.. సస్పెన్షన్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 18, 2020 | 2:54 PM

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులకు తోడ్పడ్డాడన్న ఆరోపణలపై అరెస్టయిన డీఎస్పీ దావేందర్ సింగ్ పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)  కేసు దాఖలు చేసింది. ఆయుధ చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ కేసు పెట్టారు. ఇతడ్ని సస్పెండ్ చేసినట్టు ఎన్ఐఎ వర్గాలు తెలిపాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీకి తరలిస్తూ సింగ్ శ్రీనగర్ లోని షోపియన్ ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనిపై మొత్తం 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ సింగ్ అనేక సార్లు ఉగ్రవాదులను తరలించాడట. జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన అధికారుల బృందం ఈ నెల 20 న కాశ్మీర్ రాష్ట్రానికి వెళ్లి ఆయనను ఢిల్లీకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఇతడ్ని విచారించే అవకాశాలున్నాయి.