కెర్మిడిక్ ద్వీపాల్లో భారీ భూకంపం

న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఈశాన్యం ఉన్న కెర్మిడిక్ ద్వీపాల్లో.. రిక్టార్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. భూకంప పరిస్థితులను పరీక్షిస్తున్నట్లు న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ తెలిపింది. భూకంప తీవ్రత అధికంగా ఉండడంతో అధికారులు అప్రమత్తమై, మొదట సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూ ప్రకంపనలకు స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తీరప్రాంతవాసులను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ […]

కెర్మిడిక్ ద్వీపాల్లో భారీ భూకంపం
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2019 | 9:54 AM

న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఈశాన్యం ఉన్న కెర్మిడిక్ ద్వీపాల్లో.. రిక్టార్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. భూకంప పరిస్థితులను పరీక్షిస్తున్నట్లు న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ తెలిపింది. భూకంప తీవ్రత అధికంగా ఉండడంతో అధికారులు అప్రమత్తమై, మొదట సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూ ప్రకంపనలకు స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తీరప్రాంతవాసులను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ తరువాత వాతావరణశాఖ అధికారులు సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. భూకంప తీవ్రత ప్రభావం సముద్ర తీరంలో అంత తీవ్రస్థాయిలో ఉండబోదని ప్రకటించారు.