వాట్సాప్‌లో మరో అమేజింగ్ ఫీచర్.. చూస్తే వావ్ అనాల్సిందే.!

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ.. మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూపోతోంది.

వాట్సాప్‌లో మరో అమేజింగ్ ఫీచర్.. చూస్తే వావ్ అనాల్సిందే.!
Follow us

|

Updated on: Nov 04, 2020 | 6:00 PM

New Feature Roll Out In Whatsapp: సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ.. మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూపోతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. బల్క్ ఐటెమ్‌లను డిలీట్ చేసి స్టోరేజ్ కెపాసిటీ పెంచుకునే విధంగా ఓ లేటెస్ట్ ఫీచర్‌ను తీసుకువస్తున్నామని వాట్సాప్‌ ప్రకటించింది.

ఈ సరికొత్త ఫీచర్ ద్వారా మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు లాంటివి ఏవైనా కూడా ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చునని తెలిపింది. ఈ టూల్ ఎలా పని చేస్తుందో తెలుపుతూ తమ ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందంది. కాగా, యాప్‌లో సెటింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ అండ్ డేటాను ఎంచుకుని మేనేజ్ స్టోరేజ్ క్లిక్ చేస్తే మనం ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌లు, 5 ఎంబీ కంటే ఎక్కువ స్పేస్ ఉన్న ఫైల్స్‌ను చూపిస్తుంది. ఇక వాటిల్లో మనకు అవసరం లేనివి వాట్సాప్‌ నుంచి డిలీట్ చేయొచ్చు.