త్వరలో నయన్‌-విఘ్నేష్‌ పెళ్లి.. మొదలైన ఏర్పాట్లు..!

దక్షిణాది లేడి సూపర్‌స్టార్ నయనతార పెళ్లి పీటలెక్కనుందా..? ప్రేమించిన విఘ్నేష్‌ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీ అయ్యిందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో. 5 ఏళ్ల తమ సుదీర్ఘ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్లేందుకు విఘ్నేష్‌-నయన్ సిద్దమయ్యారని పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే వీరిద్దరు ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారని, ఇందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు టాక్‌ నడుస్తోంది. కాగా 2003లో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నయనతార తెలుగు, తమిళం, […]

త్వరలో నయన్‌-విఘ్నేష్‌ పెళ్లి.. మొదలైన ఏర్పాట్లు..!
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 5:24 PM

దక్షిణాది లేడి సూపర్‌స్టార్ నయనతార పెళ్లి పీటలెక్కనుందా..? ప్రేమించిన విఘ్నేష్‌ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీ అయ్యిందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో. 5 ఏళ్ల తమ సుదీర్ఘ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్లేందుకు విఘ్నేష్‌-నయన్ సిద్దమయ్యారని పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే వీరిద్దరు ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారని, ఇందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు టాక్‌ నడుస్తోంది.

కాగా 2003లో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నయనతార తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో 70కి పైగా చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఇది వరకు రెండు సార్లు ప్రేమలో విఫలమమ్యారు. మొదట నటుడు శింబుతో ప్రేమలో పడ్డ నయన్‌.. కొన్ని కారణాల వలన అతడి నుంచి విడిపోయింది. ఆ తరువాత ప్రముక కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవాను నయన్ ప్రేమించింది. వీరిద్దరు పెళ్లి వరకు వెళ్లారు. అయితే వీరిద్దరి రిలేషన్‌ కూడా మధ్యలో బ్రేక్ అయ్యింది. ఇక నానుమ్ రౌడీదాన్ సమయంలో విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. అప్పటి నుంచి ఈ ఇద్దరు రిలేషన్‌లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా మళ్లీ నయన్- విఘ్నేష్ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇరువురి ఇంట్లో నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఇటీవల మదర్స్‌ డే రోజున నయన్‌ ఫొటోను షేర్ చేసిన విఘ్నేష్‌.. భవిష్యత్‌లో నా పిల్లలకు కాబోయే తల్లి అంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.

Read This Story Also: బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. సౌతిండియాలోనే మొదటి హీరో..!

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక