ఆర్మీ అమ్ములపొదలో మరో ఫైటర్ జెట్..!

భారత్ వాయుసేన మరింత బలోపేతం కానుంది. మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీతో ఫైటర్ జెట్ రెడీ అవుతోంది. ప్రొటోటైప్ ‘తేజస్ ఎన్’ యుద్ధవిమానం.. ఇప్పటికే కొన్ని టెస్టులు పూర్తి చేసుకుంది. నేవీ ఎయిర్​క్రాఫ్ట్ క్యారియర్ ‘ఐఎన్ఎస్ విక్రమాదిత్య’పై జరిపిన ట్రయల్ ల్యాండింగ్స్ సక్సెస్ అయ్యాయి.

ఆర్మీ అమ్ములపొదలో మరో ఫైటర్ జెట్..!
Follow us

|

Updated on: Jun 05, 2020 | 5:18 PM

భారత్ వాయుసేన మరింత బలోపేతం కానుంది. మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీతో ఫైటర్ జెట్ రెడీ అవుతోంది. ప్రొటోటైప్ ‘తేజస్ ఎన్’ యుద్ధవిమానం.. ఇప్పటికే కొన్ని టెస్టులు పూర్తి చేసుకుంది. నేవీ ఎయిర్​క్రాఫ్ట్ క్యారియర్ ‘ఐఎన్ఎస్ విక్రమాదిత్య’పై జరిపిన ట్రయల్ ల్యాండింగ్స్ సక్సెస్ అయ్యాయి. స్వదేశీ పరిజ్జానంతో రూపొందిన ‘తేజస్ ఎన్’.. వచ్చే ఆరేళ్లలో ఎయిర్​ఫోర్స్​లోకి చేరనుంది. రెండు ఇంజిన్లతో కూడిన ఈ ఫైటర్ జెట్​ను డెవలప్ చేసేందుకు ఎయిరోనాటికల్ డెవలప్​మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఇప్పటికే అనుమతి ఇచ్చింది. తేజస్ ఫైటర్​ప్రిన్సిపల్ డిజైనర్ కూడా ఏడీఏనే. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​తో గతనెల చివరిలో జరిగిన సమావేశంలో ఏడీఏ ఈ మేరకు ‘తేజస్​ఎన్’​పై చర్చించింది. ఈ మీటింగ్ తర్వాతే కొత్త ఫైటర్ విమానం తయారీకి సంబంధించిన ఆపరేషనల్ రిక్వైర్​మెంట్స్ ను రక్షణ శాఖ ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ జారీ చేసింది. ఈ ప్రొటోటైప్ ఫైటర్ జెట్​ను ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లపై మోహరించేందుకు రూపొందించారు. వచ్చే ఆరేళ్లలో దీన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడానికి రక్షణ శాఖ ఫ్లాన్ చేసింది. తేజస్ ఎన్ ప్రోటోటైప్ డిజైన్​ను పూర్తిగా స్వదేశీ పరిజ్జానంతో తయారు చేశారు. రెండు ఇంజన్లతో కూడిన జెట్ ను గోవా తీరంలోని ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ప్రయోగాత్మకంగా పదర్శన నిర్వహించారు. అరెస్టెడ్ ల్యాండింగ్స్, టేకాఫ్స్​ను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకుంది. రెండు ప్రోటోటైప్ జెట్లు ఈ మేరకు సిద్ధమయ్యాయి. ఐఏఎఫ్ అడ్వాన్స్‌‌‌‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ కోసం అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీలను ఈ కొత్త జెట్ లో ఏర్పాటు చేయొచ్చని ఈ ప్రోగ్రామ్​లో పాల్గొన్న ఎక్స్​పర్టులు చెబుతున్నారు. కొత్త జెట్లు అందుబాటులోకి వస్తే.. మన ఎయిర్ కెపాసిటీ పెరుగుతుందంటున్న రక్షణ శాఖ నిపుణులు.

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం