పుకార్లపై స్పందించిన నాని..!

‘జెర్సీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో మొదటిది విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ కాగా.. మరొకటి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘వి’ అనే చిత్రం. ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా ‘బ్రహ్మోత్సవం’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో నాని ఓ సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వాటిపై నాని స్పందించాడు.

శ్రీకాంత్ అడ్డాలతో కలిసి పని చేయట్లేదని.. అవి వట్టి ఫేక్ న్యూస్ మాత్రమే అని తేల్చేశారు నాని. దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆల్వేజ్ నాని ఫ్యాన్స్ ట్విట్టర్ పేజ్‌లో వచ్చిన ట్వీట్‌కు నాని రిప్లై ఇస్తూ.. ఈ వార్త నిజం కాదు మై బాయ్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తన ట్వీట్‌తో వస్తున్న వార్తలన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టాడు నేచురల్ స్టార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *