ఢిల్లీ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం ‘యోగా సెషన్’

ఢిల్లీలో ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్ నిర్వహిస్తున్న సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ కమ్ ఆసుపత్రిలో ప్రస్తుతం 1200 మందికి పైగా కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అయిదున్నర వేల మంది..

ఢిల్లీ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం యోగా సెషన్

Edited By:

Updated on: Oct 04, 2020 | 11:36 AM

ఢిల్లీలో ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్ నిర్వహిస్తున్న సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ కమ్ ఆసుపత్రిలో ప్రస్తుతం 1200 మందికి పైగా కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అయిదున్నర వేల మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతమున్న రోగులకు ప్రత్యేకంగా యోగా సెషన్ ని యాజమాన్యం నిర్వహించడం విశేషం. పేషంట్స్ అంతా ఉత్సాహంగా ఈ యోగాలో పాల్గొన్నారు. కాగా-ఆదివారం నాటికీ ఇండియాలో కరోనా వైరస్ కేసులు 65 లక్షలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో డబ్బై అయిదు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సుమారు లక్ష మంది రోగులు మృత్యు బాట పట్టారు. ఢిల్లీ నగరంలో సుమారు మూడు లక్షల కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.