
గుజరాత్ లోని గిర్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో పని చేసే తొలి మహిళా ఫారెస్ట్ గార్డ్ అయిన రసీలా వాధేర్ ని అంతా ‘వుమన్ లయన్ కింగ్’ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఈ కేంద్రంలోని క్రూర మృగాల ఆలనాపాలనా చూసే ఈమెకు అవి అంటే అసలు భయం లేదట.. గాయపడిన జంతువులకు చికిత్స చేసి వాటిని మళ్ళీ హెల్దీగా చేయడంలోనూ, ‘అనాథలైన’ పసి జంతుకూనలను ఆదుకోవడంలోనూ రసీలాకు సాటి ఎవరూ లేరు. ఇప్పటివరకు ఈమె సుమారు 1100 వన్య మృగాలను రక్షించిందట. వీటిలో మొసళ్ళు, సింహాలు, చిరుతలు, కొండచిలువలు..ఇలా ఎన్నో ఉన్నాయి. అడవుల్లో నిర్భయంగా సంచరించడమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పే రసీలాకు గుజరాత్ ప్రభుత్వం ‘సెల్యూట్’ చెప్పింది.
2015 లో ‘ది లయన్ క్వీన్ ఆఫ్ ఇండియా’ పేరిట ఓ ‘జంతు ఛానల్’ తీసిన డాక్యుమెంటరీలో ఈ వుమన్ లయన్ కింగ్ హైలైట్ అయింది.