ట్విటర్, ఫేస్ బుక్ లతో సహా సోషల్ మీడియా దిగ్గజాలకు కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. తాము జారీ చేసిన గైడ్ లైన్స్ కి అనుగుణంగా ఇవి నడచుకోవడం లేదని, ఈ విషయంలో విఫలమయ్యాయని వీటికి పంపిన నోటీసులో పేర్కొంది. రెండు రోజుల్లో వీటిపై కఠిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. నూతన నిబంధనల ప్రకారం నడుచుకోవాలని గత ఫిబ్రవరి 25 న ఎలెక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వీటికి 3 నెలల గడువునిచ్చింది. దీనికి సంబంధించి ఈ మార్గదర్శకాలను పాటించేలా చూసే అధికారుల నియామకం, ఇండియాలో వారిని కాంటాక్ట్ చేయడానికి గాను వారి అడ్రస్, ఫిర్యాదుల వివరాలు, అభ్యంతర కంటెంట్ మానిటరింగ్, ఆ విధమైన కంటెంట్ తొలగింపు వంటివి ఈ రూల్స్ లో ఉన్నాయి. కాగా వీటిలో ఒక్క కంపెనీ తప్ప మిగతావేవీ అధికారులను నియమించలేదు. కాగా ట్విటర్, ఫేస్ బుక్ ….ఈ నోటీసుపై ఇంకా స్పందించాల్సి ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ : పోలీసులకు దొరికిన బుడ్డోడు.. భయంతో చెడ్డిలోనే పోసేసాడు.వైరల్ అవుతున్న వీడియో :Boy Lockdown Comedy Viral Vide
ప్రెషర్ కుక్కర్ తో అవారిపడుతున్న యువకుడు వైరల్ అవుతున్న వీడియో : Desi Jugaad for steam video.
Adilabad : కరోనా కాలంలో ఆకలి చావులు.. ఆకలికి తాళలేక వృద్దజంట తనువు చాలించింది..(వీడియో).