Tunnel T50: టన్నెల్ T50 గుండా వందేభారత్ ప్రయాణం.. వీడియో షేర్ చేసిన రైల్వేమంత్రి

దేశాభివృద్దిలో కశ్మీర్‌ కీలక పాత్ర పోషించబోతుందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలో ఎత్తేన చినాబ్‌ వంతెనను ప్రారంభించారు. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పామన్నారు. రక్షణరంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌తో సత్తా చాటామన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

Tunnel T50: టన్నెల్ T50 గుండా వందేభారత్ ప్రయాణం.. వీడియో షేర్ చేసిన రైల్వేమంత్రి
Ashwini Vaishnaw

Updated on: Jun 07, 2025 | 7:14 AM

పహల్గామ్‌ దాడి తరువాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి పర్యటించారు ప్రధాని మోదీ రూ. 46 వేల కోట్ల అభివృధ్ది ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌లో చినాబ్‌ వంతెను ప్రారంభించిన ప్రధాని మోదీ తరువాత . కాట్రా-శ్రీనగర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. వందేభారత్‌ రైలును జెండా ఊపారు. తరువాత వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేశారు. విద్యార్ధులతో ఆయన ముచ్చటించారు. ఈ రైలుతో శ్రీనగర్‌ నుంచి వైష్ణోదేవి ఆలయం ఉన్న కాట్రాకు మూడు గంటల్లో చేరుకునే అవకాశం లభిస్తుంది. గతంలో శ్రీనగర్‌ నుంచి ఆరు గంటలు.. ఒక్కోసారి 12 గంటల సమయం పట్టేది. కాని ఇప్పుడు మూడు గంటల్లోనే కాట్రాకు చేరుకోవచ్చు. అంతేకాకుండా వర్షాకాలంలో రోడ్డు మార్గంలో ప్రయాణం చేయడం చాలా కష్టం.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇప్పడు ఈ మార్గంలో ప్రయాణం చేయవచ్చు. ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు మోదీ.

ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చినాబ్ నది నుంచి 359 మీ. ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. నిర్మాణానికి కేంద్రం రూ.1,486 కోట్లు ఖర్చు చేసింది. ఈ వంతెన ప్రారంభోత్సవంతో… భారత రైల్వే నెట్‌వర్కుతో జమ్మూకశ్మీర్‌ పూర్తిగా అనుసంధానం అయ్యింది. అలాగే 12.77 కిలోమీటర్ల పొడవున్న T50 సొరంగం జమ్మూకశ్మీర్‌లోని ఖరీ, సుంబర్‌లను కలుపుతుంది. ఇది దేశంలోనే అతి పొడవైన రవాణా సొరంగం.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ కింద దీనిని నిర్మించారు. కశ్మీర్ లోయ, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య నిరంతరాయ రైలు కనెక్టివిటీని అందించడంలో ఈ సొరంగం కీలకమైన లింక్‌గా మారింది.

టన్నెల్ T50లో ప్రతి 50 మీటర్లకు ఓ CCTV కెమెరా అమర్చబడి ఉంది. భద్రత, సజావుగా రవాణా కార్యకలాపాలు ఈ సొరంగం గుండా సాగేందుకు ఇవి తోడ్పడటమే కాకుండా.. సీసీటీవీ ఫీడ్ మొత్తాన్ని కేంద్రం కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంది. అదనంగా ప్రాజెక్ట్ సైట్‌లకు ప్రాప్యతను అందించడానికి, సమీప కమ్యూనిటీలకు రవాణా, కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారతీయ రైల్వే 215 కిలోమీటర్ల మేరకు అప్రోచ్ రోడ్లను నిర్మించింది.

కాగా, ఈ టీ50 టన్నెల్ విశిష్టలను తెలుపుతూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో నెటిజన్లతో పంచుకున్నారు. 12.77 కిమీల ఈ టన్నెల్ ది లాంగెస్ట్ టన్నెల్ ఆఫ్ ఇండియా అని అభివర్ణిస్తూ.. ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. లేట్ ఎందుకు ఆ వీడియో మీరూ చూసేయండి.