Republic Day 2024: అట్టారీ-వాఘా సరిహద్దుల్లో బీటింగ్‌ రీట్రీట్‌ వేడుక.. భారత సైనికుల విన్యాసాల వీడియో చూశారా..

Beating Retreat Ceremony At Attari Wagah Border: రిపబ్లిక్‌ డే సందర్భంగా పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో దేశం మీసం మెలేసింది. తమ శక్తిని చూడండంటూ భారత వీర సైనికులు రోషం, పౌరుషం చూపించారు. పందెం పుంజుల్లా పోటీ పడి మరీ పాక్‌ రేంజర్లను మించి కవాతు చేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే BSF సైనికుల విన్యాసాలు శివ తాండవాన్ని తలపించాయి.

Republic Day 2024: అట్టారీ-వాఘా సరిహద్దుల్లో బీటింగ్‌ రీట్రీట్‌ వేడుక.. భారత సైనికుల విన్యాసాల వీడియో చూశారా..
Beating Retreat Ceremony At Attari Wagah Border Ahead Of Republic Day

Updated on: Jan 25, 2024 | 6:11 PM

రిపబ్లిక్‌ డే సందర్భంగా పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో దేశం మీసం మెలేసింది. తమ శక్తిని చూడండంటూ భారత వీర సైనికులు రోషం, పౌరుషం చూపించారు. పందెం పుంజుల్లా పోటీ పడి మరీ పాక్‌ రేంజర్లను మించి కవాతు చేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే BSF సైనికుల విన్యాసాలు శివ తాండవాన్ని తలపించాయి. భారత సైనికుల శక్తిని కళ్లకు కట్టాయి. వాఘా సరిహద్దులో గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగిన తీరు ఇది. బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమంలో భాగంగా.. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు , పాక్‌ రేంజర్లు….బోర్డర్‌ దగ్గర కదం తొక్కారు. ఇరుదేశాల సైనికుల కవాతు అందరిని ఆకట్టుకుంది.

ప్రతిరోజు వాఘాలో బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇవాళ జరిగిన వేడుకలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇరుదేశాల నుంచి వేలాదిమంది జనం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అటు పాక్‌ సైనికుల కవ్వింపులు.. ఇటు భారత జవాన్ల కౌంటర్‌ అందరిని ఆకట్టుకుంది. వాఘా సరిహద్దులో బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. హిందూస్థాన్‌ జిందాబాద్‌ నినాదాలు అక్కడ మారుమోగాయి. బీటింగ్ రిట్రీట్ వేడుకను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు.

భారత్-పాక్ సేనల బీటింగ్ రిట్రీట్..

భారత్-పాకిస్థాన్.. రెండు దేశాలకు ఒక్క గేటు మాత్రమే అడ్డు. అదే పంజాబ్‌లోని అట్టారీ, వాఘా సరిహద్దు. ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు. రెండు దేశాల సైనికులు ఎదురుపడి పరస్పరం సెల్యూట్ చేసుకోవడం చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంత ఉద్విగ్నభరితంగా సాగింది బీటింగ్ రిట్రీట్. హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తుండగా బీఎస్ఎఫ్ జవాన్‌లు పరేడ్ చేశారు. ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కలబడడానికి వెళుతున్నారా అన్నట్లు సాగింది ఈ కార్యక్రమం.