Viral News: పెళ్లి పందిరిలో అకస్మాత్తుగా బట్టలు విప్పేసిన వరుడు.. అసలు విషయం తెలిసి పెళ్లి కూతురు షాక్..

అకస్మాత్తుగా ఏమి జరిగిందో..ఏమిటో పెళ్లి కొడుకు చేసిన పనికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి మండపం వద్ద వరుడు వింతగా నటించడం ప్రారంభించాడు. హఠాత్తుగా ఒక్కొక్కటిగా బట్టలు తీయడం మొదలు పెట్టాడు..

Viral News: పెళ్లి పందిరిలో అకస్మాత్తుగా బట్టలు విప్పేసిన వరుడు.. అసలు విషయం తెలిసి పెళ్లి కూతురు షాక్..
Damoh District Of Madhya Pr
Follow us

|

Updated on: Jun 24, 2022 | 8:21 PM

Viral News: తమ పిల్లల పెళ్లి అవుతుందంటే.. ఆ కుటుంబ సభ్యుల్లో సంతోషం.. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. అదే విధంగా ఆ ఇంట్లో కూడా పెళ్లి సందడి వాతావరణం నెలకొంది. పెళ్లి మంటపంపై వరుడు కూర్చున్నాడు. అయితే అకస్మాత్తుగా ఏమి జరిగిందో..ఏమిటో పెళ్లి కొడుకు చేసిన పనికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి మండపం వద్ద వరుడు వింతగా నటించడం ప్రారంభించాడు. హఠాత్తుగా ఒక్కొక్కటిగా బట్టలు తీయడం మొదలు పెట్టాడు.. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో చోటు చేసుకుంది. వరుడి చేసిన పనికి పెళ్లి కూతురు, వధువు ఫ్యామిలీ షాక్ తింది. గదర్వార నుండి ఊరేగింపులోనే తిరిగి ఇంటికి వచ్చింది. అంతేకాదు వరుడిని స్తంభానికి కట్టేసి బస్సు లోపల వేసుకుని తీసుకెళ్లారు. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో, చదివిన జనాలు ఆశ్చర్యపోయారు. అయితే అసలు విషయం ఏమిటంటే..

మీడియా కథనాల ప్రకారం..  నర్సింగపూర్ జిల్లాలోని గదర్వాలా నుండి దామోహ్‌కు పెళ్లి ఊరేగింపు చేరుకుంది. అయితే వరుడు పెళ్లి మండపం వద్దకు చేరుకోగానే చాలా హంగామాతో బట్టలు విప్పడం మొదలుపెట్టాడు. ఇది చూసిన జనాలు వరుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో అని ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన వరుడు, వధువు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత విషయం సద్దుమణిగి.. పెళ్లి జరిపించడం కోసం రెడీ అయ్యారు. ముహార్తానికి పెళ్లి జరిగింది. అనంతరం పెళ్లికొడుకు మానసిక రోగి అని యువతికి తెలిసింది. దీంతో పెళ్లి కుమార్తెను అత్తమామల ఇంటికి పంపేందుకు బాలిక కుటుంబం నిరాకరించింది.

పెళ్లికొడుకును కట్టేసి ఇంటికి తీసుకెళ్లారు వరుడు తరపున బంధువులు అమ్మాయి తరపు వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోకపోవడంతో అబ్బాయి తరపు వారు పెళ్లికొడుకును బస్సులో కట్టేసి ఇంటికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇందులో వరుడు బస్సులోపల పిల్లర్‌కు కట్టబడి కనిపించాడు. ఈ సమయంలో, అతను పదేపదే దూషించే పదాలను ఉపయోగించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి జరిగిన తర్వాత గురువారం ఉదయం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే దీనికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మహిళా స్టేషన్‌ ఇన్‌చార్జి సుశీలా శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. కూతురిని పంపేందుకు వధువు తరపు వారు నిరాకరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..