Covid-19 Vaccine: కరోనా టీకా 8 నుంచి 10 నెలల వరకు రక్షణ ఉంటుంది: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా

Covid-19 Vaccine: కరోనా టీకాలు 8 నుంచి 10 నెలల పాటు వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. అయితే ఇప్పటి వరకు టీకాలు..

Covid-19 Vaccine: కరోనా టీకా 8 నుంచి 10 నెలల వరకు రక్షణ ఉంటుంది: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా
Aiims Director Randeep Guleria
Follow us

|

Updated on: Mar 21, 2021 | 1:08 PM

Covid-19 Vaccine: కరోనా టీకాలు 8 నుంచి 10 నెలల పాటు వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. అయితే ఇప్పటి వరకు టీకాలు తీసుకున్న వారిలో తీవ్రస్థాయి దుష్ప్రభావాలు ఎదురు కాలేదని స్పష్టం చేశారు. కోవిడ్‌ టీకాలు 8 నుంచి 10 నెలల వరకు లేక ఎక్కువ కాలం రక్షణ ఇస్తాయని, మహమ్మారి సమసిపోతుందని, ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం వల్ల మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోందని అన్నారు. ఇతర కారణాలు ఏవైనప్పటికీ ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు. మరి కొంత కాలం అత్యవసరం కానీ ప్రయాణాలను తగ్గించుకోవాలని ఐపీఎస్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గులేరియా సూచించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన నీతి అయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మాట్లాడుతూ.. కరోనా నిబంధనలు పాటించకపోవడమే తాజాగా కరోనా కేసులు పెరగడానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో రెండో దశలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోందని, ఈ కార్యక్రమంలో భాగంగా 4 కోట్లకుపైగా టీకాలు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించారు. అయితే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని రణదీప్‌ గులేరియా అన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో చాలా మంది మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటివి చేస్తున్నారని, దీని వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నిబంధనలు పాటించకపోతే మళ్లీ గత ఏడాది పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

కాగా, ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే.. మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది కదా అని నిర్లక్ష్యం చేసే వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం బయటకు వెళ్తుంటే ఎవ్వరు కూడా మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం అసలే లేదు. ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు తప్ప.. అందులో ఎవ్వరికి మాస్కలు ఉండటం లేదు. అధికారులు, పోలీసులు ఎన్ని విధాలుగా, వివిధ రకాలుగా అవగాహన కల్పి్స్తున్నా.. కొందరిలో ఏ మాత్రం అవగాహన రావడం లేదు. మానవుని నిర్లక్ష్యం కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతున్నాయని పరిశోధుకులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతో చెప్పామని, ఇంకా చెప్పేది ఏది లేదని, మనిషి తనకు తాను నిబంధనలు పాటిస్తే తప్ప ఏమి చేయలేమని చెబుతున్నారు.

ఇవీ చదవండి :

Vaccination In UK: బ్రిటన్‌లో నెమ్మదించనున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. భారత్‌ వ్యాక్సిన్ ఎగుమతిని తగ్గించడమే కారణం..

Donald Trump: ‘మనల్ని కరోనా మహమ్మారి నుంచి రక్షించేది వ్యాక్సిన్‌ ఒక్కటే’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌.