వ్యాక్సిన్ బృందంపై కర్రలు, రాడ్లతో గ్రామస్థుల దాడి, కొందరికి గాయాలు, పరుగులు తీసిన మెడికల్ టీమ్ , ఎక్కడంటే ?

వ్యాక్సినేషన్ పై ప్రజల్లోని అపోహలను, అనుమానాలను పటాపంచలు చేసేందుకు ఓ గ్రామానికి వెళ్లిన వ్యాక్సిన్ బృందంపై గ్రామస్థులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు.

వ్యాక్సిన్ బృందంపై కర్రలు, రాడ్లతో  గ్రామస్థుల దాడి,  కొందరికి గాయాలు, పరుగులు తీసిన మెడికల్ టీమ్ , ఎక్కడంటే ?
Vaccine Team Hit With Rod
Follow us

| Edited By: Phani CH

Updated on: May 25, 2021 | 8:45 AM

వ్యాక్సినేషన్ పై ప్రజల్లోని అపోహలను, అనుమానాలను పటాపంచలు చేసేందుకు ఓ గ్రామానికి వెళ్లిన వ్యాక్సిన్ బృందంపై గ్రామస్థులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా మెయిల్ ఖేడీ అనే గ్రామంలో ఈ అనూహ్య ఘటన జరిగింది. గ్రామస్థులకు టీకాలు వేయించేందుకు, మొదట వారి భయాలను పోగొట్టేందుకు నిన్న ఈ బృందం ఈ గ్రామానికి చేరుకుంది. స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా సుమారు 50 మంది రాడ్లు, కర్రలతో అక్కడికి దూసుకువచ్చి వారిపై ఎటాక్ చేశారు. దీంతో మెడికల్ టీమ్ సభ్యులంతా తలో దిక్కుకు పారిపోయారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. మహిళా పంచాయతీ అధికారి భర్త తీవ్రంగా గాయపడినట్టు ఆ తరువాత పోలీసులు తెలిపారు. టీకామందు తీసుకుంటే తమకు హాని కలుగుతుందని, అనారోగ్యం పాలవుతామనే మూఢ నమ్మకం గ్రామస్తుల్లో ఉందని వారు చెప్పారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎటాక్ కి పాల్పడినవారిలో నలుగురిని అరెస్టు చేశామని, మిగిలినవారికోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. గతంలో కూడా ఈ గ్రామానికి వచ్చిన మెడికల్ బృందంపై గ్రామస్థులు ఇలాగే దాడికి యత్నించారు. వారిని దుర్భాషలాడి తమ గ్రామంనుంచి పారిపోయేలా చేశారు.

తాజా ఘటనతో ఇక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గాయపడినవారిని పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. వ్యాక్సిన్ కోసం ఓ వైపు దేశ ప్రజలంతా ఎదురు చూస్తుంటే మరో వైపు ఇక్కడివారు టీకామందు వద్దు వద్దు అంటూ ఈ బృందాన్ని అడ్డుకోవడం ఆశ్చర్యకరమని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Hyderabad Water Supply Alert: నగరవాసులకు అలర్ట్.. హైదరాబాద్‏లో నీటి సరఫరాలో అంతరాయం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే..

Lunar Eclipse 2021: రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏ సమయంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది..? 2021లో సంభవించే గ్రహాలు ఇవే

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?