ఐదు నెలల చిన్నారితో విధులు నిర్వహిస్తున్న బస్‌ కండక్టర్‌.. విజ్ఞప్తిని తిరస్కరించిన ఆర్టీసీ అధికారులు

ఓ మహిళా బస్‌ కండక్టర్‌ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. తాను పని చేసే రవాణా శాఖలో పిల్లల సంరక్షణ సెలవులు లేకపోవడంతో ఆ మహిళా కండక్టర్‌ ఎన్నో ఇబ్బందులకు ...

ఐదు నెలల చిన్నారితో విధులు నిర్వహిస్తున్న బస్‌ కండక్టర్‌.. విజ్ఞప్తిని తిరస్కరించిన ఆర్టీసీ అధికారులు
Follow us

|

Updated on: Feb 13, 2021 | 1:03 PM

ఓ మహిళా బస్‌ కండక్టర్‌ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. తాను పని చేసే రవాణా శాఖలో పిల్లల సంరక్షణ సెలవులు లేకపోవడంతో ఆ మహిళా కండక్టర్‌ ఎన్నో ఇబ్బందులకు గురవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో శిప్రా దీక్షిత్‌ అనే మహిళ కండక్టర్‌ ఐదు నెలల చిన్నారితో విధులకు హాజరవుతోంది.  ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌ నుంచి పద్రౌనా మధ్యలో నడిచే బస్సులో పసికందును చంకనెత్తుకుని టికెట్లు ఇస్తున్నారు.

శిప్రా దీక్షిత్‌ 2016 నుంచి కండక్టర్‌గా పని చేస్తున్నారు. 2020 జులై 25 నుంచి ఆరు నెలల పాటు ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. తర్వాత 2020 ఆగస్టు 21న ఓ పాపకు జన్మనిచ్చింది. 2021 జనవరి 19న తిరిగి విధుల్లో చేరింది. అయితే పసిపాపకు ఆలనా పాలనా చూసుకునేందుకు వీలుగా కండక్టర్‌గా కాకుండా కార్యాలయానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసినా అధికారులు తిరస్కరించారు. ఎక్కడ ఉద్యోగం పోతుందనే భయంతో ఇలా పసికందుతో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో పిల్లల సంరక్షణకు సెలవులు లేకపోవడం గమనార్హం.

Also Read:

Nandyal Families Fight: రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చెత్త, కుక్క.. కత్తులతో దాడి.. చివరకు ఏమైందంటే..!

Firecracker Factory: టపాకాయల తయారీ కేంద్రంలో మరో భారీ పేలుడు.. మంటలను ఆర్పుతున్న అగ్ని మాపక సిబ్బంది