షాకిచ్చిన కోట్ల కరెంట్ బిల్లు..

| Edited By:

Jul 21, 2019 | 12:33 PM

128 కోట్ల 45 లక్షల 95 వేల 444 రూపాయలు.. ఇది ఓ నిరుపేద ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు. నిరుపేద ఎంటి ఇంత కరెంట్ బిల్లు ఎంటీ అనుకుంటున్నారా..? ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమో.. లేక సాంకేతిక సమస్యనో అనేది తెలీదు.. కానీ ఈ బిల్లును చూసిన ఆ ఇంటి యజమానికి కళ్లు బైర్లు కమ్మాయి. వేలాది రూపాయలను కూడా చూడని అతనికి వందల కోట్ల రూపాయల కరెంట్ బిల్లు చూసేసరికి మతిపోయింది. యూపీలోని హాపూర్‌లో […]

షాకిచ్చిన కోట్ల కరెంట్ బిల్లు..
Follow us on

128 కోట్ల 45 లక్షల 95 వేల 444 రూపాయలు.. ఇది ఓ నిరుపేద ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు. నిరుపేద ఎంటి ఇంత కరెంట్ బిల్లు ఎంటీ అనుకుంటున్నారా..? ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమో.. లేక సాంకేతిక సమస్యనో అనేది తెలీదు.. కానీ ఈ బిల్లును చూసిన ఆ ఇంటి యజమానికి కళ్లు బైర్లు కమ్మాయి. వేలాది రూపాయలను కూడా చూడని అతనికి వందల కోట్ల రూపాయల కరెంట్ బిల్లు చూసేసరికి మతిపోయింది.

యూపీలోని హాపూర్‌లో నివాసముంటున్న షమీమ్ అనే పేద వ్యక్తి ఇంటికి రూ.128,45,95,444/- కరెంట్ బిల్లు వచ్చింది. బిల్లును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం అతని వంతైంది. పూట గడవడానికే కష్టంగా ఉండే తాము.. ఈ బిల్లును ఎలా చెల్లించేదంటూ షమీమ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అవేమి పట్టించుకోవడం లేదు. అయితే కొసమెరుపేంటంటే.. బిల్లు చెల్లించలేదంటూ ఆ ఇంటికి కరెంట్ కట్ చేశారు విద్యుత్ అధికారులు. బిల్లు చెల్లిస్తేనే కరెంట్ పునరుద్ధరిస్తామంటూ తెగేసి చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.