గమ్యస్థానాలకు వెళ్తూ.. మృత్యు ఒడిలోకి వెళ్లిన వలస కార్మికులు..

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాల బాటపట్టారు. వాహన సౌకర్యం లేకపోవడంతో.. హైవేలపై కాలి బాటన నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో పలువురు వలస కార్మికులు.. ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటి వరకు కొందరు అస్వస్థతతో ప్రాణాలు కోల్పోతే.. తాజాగా గడిచిన రెండు మూడు రోజులుగా ప్రమాదాలకు గురవుతూ మరణిస్తున్నారు. తాజాగా.. జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం పద్నాలుగు […]

గమ్యస్థానాలకు వెళ్తూ.. మృత్యు ఒడిలోకి వెళ్లిన వలస కార్మికులు..
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 11:27 AM

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాల బాటపట్టారు. వాహన సౌకర్యం లేకపోవడంతో.. హైవేలపై కాలి బాటన నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో పలువురు వలస కార్మికులు.. ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటి వరకు కొందరు అస్వస్థతతో ప్రాణాలు కోల్పోతే.. తాజాగా గడిచిన రెండు మూడు రోజులుగా ప్రమాదాలకు గురవుతూ మరణిస్తున్నారు. తాజాగా.. జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు.

యూపీ, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు.. వారి వారి స్వస్థలాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌- శహరాన్‌పుర్‌ హైవేపై.. యూపీకి చెందిన ఓ ఆర్టీసీ బస్సు ఆరుగురు కూలీలపై దూసుకెళ్లింది. దీంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బీహార్‌ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పంజాబ్ నుంచి వీరంతా బీహార్ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మరో సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ యూపీకి చెందిన ఎనిమిది మంది కూలీలు ప్రాణాలు విడిచారు. బుధవారం నాడు మహారాష్ట్ర నుంచి యూపీకి లారీలో వెళ్తుండగా.. మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంత సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వలస కార్మికులతో వెళ్తున్న లారీని.. ఓ బస్సు ఢీకొట్టడంతో.. 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 50 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..