రాత్రి క్యాబ్‌లో వెళ్లిన కుటుంబం.. తెల్లవారేసరికల్లా బావిలో శవాలై తేలిన ఐదుగురు!

తమిళనాడులోని కరూర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యవసాయ క్షేత్రంలోని బావిలో విగతజీవులుగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతుల్లో భార్యాభర్తలు, వారి కుమార్తె, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కుటుంబంలోని ఐదుగురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

రాత్రి క్యాబ్‌లో వెళ్లిన కుటుంబం.. తెల్లవారేసరికల్లా బావిలో శవాలై తేలిన ఐదుగురు!
Tragedy In Karur

Updated on: Nov 19, 2026 | 7:44 AM

తమిళనాడులోని కరూర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యవసాయ క్షేత్రంలోని బావిలో విగతజీవులుగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతుల్లో భార్యాభర్తలు, వారి కుమార్తె, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కుటుంబంలోని ఐదుగురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. కరూర్ సమీపంలోని వెంగమేడు కొంగు నగర్‌కు చెందిన రామస్వామి (63), ఆయన భార్య జానకి (60), కుమార్తె సుగుణ (35), మనవరాలు శివాని (10), మనవడు అధిరన్ (4) ఈ ఘటనలో మృతి చెందారు. సుమారు 13 ఏళ్ల క్రితం వేలాయుధంపాళయానికి చెందిన ప్రభుతో సుగుణకు వివాహమైంది. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నవంబర్ 15వ తేదీ నుంచి సుగుణ తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది.

ఈ క్రమంలో బుధవారం (నవంబర్ 18) ఐదుగురు కలిసి క్యాబ్‌లో చిన్న కాళిపాళయం ప్రాంతంలోని రామస్వామికి చెందిన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రం 5.20 గంటల సమయంలో వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ఐదుగురి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పక్క పొలానికి చెందిన రైతు కరుప్పణ్ణన్ పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బావిలో నుంచి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం వాటిని కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. బావి సమీపంలో ఒక బ్యాగ్‌తో పాటు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై వాంగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఐదుగురి మరణానికి సంబంధించిన పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో కరూర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారుల మరణం స్థానికులను కలచివేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us