కరోనా నివారణకు చేతులను శుభ్రంగా సబ్బు నీటితో కడుక్కోవడం అతి ముఖ్యం.. ఇది అతి సులువైన మార్గమే అయినా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు.. అందుకే కేరళ పోలీసులు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు. ఆరుగురు పోలీసులు వినూత్నంగా డ్యాన్స్ చేస్తూ.. హ్యాండ్ వాషింగ్ పై ఎవేర్ నెస్ కల్పించడానికి ప్రయత్నించారు. ఓ మలయాళీ సినిమాలోని ఓ సాంగ్ నేపధ్యమే దీనికి మూలమట. స్టేట్ పోలీస్ మీడియా సెంటర్ ఈ వీడియోను రిలీజ్ చేసింది. ఫేస్ బుక్ వగైరా సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. వేలాది షేర్స్, లైక్స్, కామెంట్స్ ని ఇది సొంతం చేసుకుంది. కాగా కేరళలో 23 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.