Snake Bite: వర్షాకాలంలో పాములు సంచారం పెరిగిపోయింది. జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని వార్దా తాలూకా బోర్ఖేడి-కాలా గ్రామంలో దారుణం వెలుగు చూసింది. ఇంట్లోకి చొరబడిన పాము.. చిన్నారిని కాటు వేసింది. ప్రస్తుతం చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. బోర్ఖేడీ-కాలా గ్రామానికి చెందిన గడ్కరీ కుటుంబం.. రోజూలాగే రాత్రి భోజనం తరువాత నిద్రపోయారు. పూర్వ గడ్కరీ(6) తన తల్లితో కలిసి నిద్రపోయింది. అర్థరాత్రి 12 గంటల సమయంలో పూర్వ తల్లికి ఏదో తట్టినట్లు అనిపించింది. వెంటనే లేచిన ఆమె.. పామును గమనించి పక్కకు వెళ్లింది.
అయితే, పూర్వ అక్కడే ఉండిపోయింది. పాము పూర్వపక్కనే పడగ విప్పి కూర్చుంది. 5, 10 నిమిషాలు కాదు ఏకంగా 2 గంటల పాటు అలాగే పడగ విప్పి నిల్చొని ఉంది. ఇంతల్లో పూర్వ తల్లి చుట్టుపక్కన వారిని పిలిచింది. వారంతా వచ్చి చూడగా.. పూర్వ తలవద్దే పాము పడగ విప్పి ఉంది. పూర్వ కూడా మేల్కొంది. కానీ, ఏమాత్రం అలజడి చేసినా కాటు వేసే ప్రమాదం ఉంది. దాంతో పూర్వ సైతం సైలైంట్ ఉండిపోయింది. ప్రజలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండిపోయారు. పాము వెళ్లిపోయేంత వరకు సైలెంట్‌గా ఉండాలని సూచించారు.
పాము ఎప్పుడు వెళ్లిపోతుందా? అని అంతా ఎదురు చూశారు. కానీ, పాము మాత్రం అస్సలు కదలడం లేదు. పూర్వ ఇంటికి జనాల తాకిడీ పెరగడం వలన పాము భయంతో అక్కడే ఉండిపోయింది. చివరికి రెండు గంటల తరువాత పాము వెళ్లిపోయింది. కానీ, వెళ్తూ వెళ్తూ ఆ చిన్నారిని కాటేసింది. పాము బయటకు వెళ్లగానే చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. సేవాగ్రామ్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పూర్వ ఆరోగ్యంగా నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Also read:
Silver Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. కొన్ని నగరాల్లో మార్పులు..!
Gold Price Today: పడిపోయిన బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..