Viral Video: తెలుగు వ్యక్తి ప్లకార్డు చూసి.. నడిరోడ్డుపై కాన్వాయ్ ఆపి..మాట్లాడిన తమిళనాడు సీఎం స్టాలిన్..

|

Feb 03, 2022 | 5:45 PM

సామాన్యుని గోడు స్వయంగా వినే నాయకునిగా మరోసారి నిరూపించుకున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్‌.. సాయం కోసం ప్లకార్డు పట్టుకొన్న ఆంధ్రా విద్యార్థిని చూసి కారు ఆపి మరీ సమస్య తెలుసుకున్నారు.. అండగా ఉంటానని భరోసా కూడా ఇచ్చారు.

Viral Video: తెలుగు వ్యక్తి ప్లకార్డు చూసి.. నడిరోడ్డుపై కాన్వాయ్ ఆపి..మాట్లాడిన తమిళనాడు సీఎం స్టాలిన్..
Tn Cm Stalin
Follow us on

TN CM Stalin: ప్రతీకార రాజకీయాలకు మారు పేరైన తమిళనాడు ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు సీఎం స్టాలిన్‌. ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి మరీ ప్రజలకు దగ్గర కావడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు.. చెన్నైలో సీఎం స్టాలిన్‌ కాన్వాయ్‌ మార్గంలో ‘ సీఎం సర్‌ హెల్ప్‌మీ ‘ అనే బోర్డు పట్టుకున్నాడో విద్యార్థి.. అతడిని చూసిన స్టాలిన్‌ వెంటనే కారు ఆపించారు.. కారు దిగి విద్యార్థి సమస్య అడిగి తెలుసుకున్నారు. తాను ఆంధ్రా(Andhra) నుంచి వచ్చానని.. నీట్‌(NEET) ద్వారా మెడిసిన్‌ సీటు రాలేదని మొర పెట్టుకున్నాడా స్టూడెంట్‌.. తనకు ఎలాగైనా సీటు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నాడు.. ఆంధ్రాలో ఎక్కడి నుంచి వచ్చావని అడిగి తెలసుకున్న స్టాలిన్‌, తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నీట్‌ ఒక్క తమిళనాడు సమస్యే కాదని.. దీనిపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నామని తెలిపారు స్టాలిన్‌. కాగా కారు ఆపిన స్టూడెంట్ పేరు సతీష్ అని.. తూర్పు గోదావరి జిల్లా(East Godavari District) వాసిగా తెలిసింది. చెన్నైలోని టీటీకే రోడ్‌లో చోటు చేసుకుందీ ఘటన. దూసుకెళ్తోన్న స్టాలిన్ కాన్వాయ్ ఒక్కసారిగా ఆగడం, ఏకంగా సీఎం కారు నుంచి కిందికి దిగడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.

ప్రజల ముఖ్యమంత్రిగా పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు స్టాలిన్‌. గతంలో ఒకసారి ఓ ట్రాఫిక్‌ కూడలి దగ్గర నిరీక్షిస్తున్న వృద్ధ మహిళను చూసి కాన్వాయ్‌ ఆపి ఆమె దగ్గర మెమొరాండం అందుకున్నారు. చెన్నైలో భారీ వర్షాలు కురిసినప్పుడు స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటించారు స్థాలిన్‌.. సిటీ బస్సు, మెట్రో రైలు ఎక్కి ప్రయాణీకుల కష్టాలు తెలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ చూడని ‘జనం ముఖ్యమంత్రి’ని స్టాలిన్‌లో చూస్తున్నారు తమిళనాడు ప్రజలు.

Also Read: మాకేదీ వినిపించదు..మాటలు కూడా రావు..! నమ్మారో ఇక అంతే!!

తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. ఈరోజు నుంచే..