నాడు డిప్రెషన్ లో సుశాంత్, ఏది నిజం ?

సుశాంత్ కేసులో మరో వాస్తవం బయట పడింది. డిప్రెషన్ తగ్గడానికి ఆయన మందులు వాడలేదని ఆయన కుటుంబం చెబుతుండగా ఇందుకు పూర్తి విరుధ్దమైన నిజం తెలియవచ్చింది.  సుశాంత్ సోదరి నీతూ సింగ్..

నాడు డిప్రెషన్ లో సుశాంత్, ఏది నిజం ?

Edited By:

Updated on: Aug 30, 2020 | 4:25 PM

సుశాంత్ కేసులో మరో వాస్తవం బయట పడింది. డిప్రెషన్ తగ్గడానికి ఆయన మందులు వాడలేదని ఆయన కుటుంబం చెబుతుండగా ఇందుకు పూర్తి విరుధ్దమైన నిజం తెలియవచ్చింది.  సుశాంత్ సోదరి నీతూ సింగ్ కి ఈ విషయం ముందే తెలుసునట..ఆమెకు, సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోడీకి మధ్య గత ఏడాది నవంబర్ 26 న జరిగిన వాట్సాప్ చాటింగే ఇందుకు నిదర్శనమంటున్నారు. అందులో తన సోదరుడు డిప్రెషన్ తగ్గేందుకు ఏయే మందులను వాడుతున్నాడో నీతూ సింగ్ తెలుసుకోగోరింది. ఆమె అడిగిన ప్రశ్నలకు శృతి మోడీ ఆ మందుల పేర్లు, ఆ డాక్టర్ పేరు కూడా వెల్లడించింది. సుశాన్ వాకర్ సైకో థెరపీ అనే ఆ డాక్టర్ పేరుని స్పష్టంగా  పేర్కొంది.

అయితే పోలీసుల దర్యాప్తులో భాగంగా  తమను సుశాంత్ డిప్రెషన్ గురించి ప్రశ్నించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు సుశాంత్ డిప్రెషన్ కి గురైనట్టు ఎప్పుడూ కనిపించేవాడు కాదని చెప్పినట్టు తెలిసింది. అలాగే సుశాంత్ డ్రగ్స్ వాడినట్టు తమకు తెలియదని వారు  తెలిపినట్టు సమాచారం. కాగా-సుశాంత్ మారిజువానా సిగరెట్లు వాడినట్టు ఆయన హౌస్ కీపర్ నీరజ్ సింగ్ లోగడ సీబీఐ అధికారులకు తెలిపిన విషయం గమనార్హం.

 

Loading...
Unable to load recommendations.
Follow Us