
వాటర్ ట్యాంక్ కూలి.. సుమారు 1.38 కోట్లు లీటర్ల నీరు ఇళ్లను ముంచెత్తిన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఎర్నాకుళం జిల్లా కొచ్చి సమీపంలోని తమ్మనం ప్రాంతంలో వాటర్ అథారిటీ ఫీడర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది, వాటర్ ట్యాంక్ కూలడంతో సుమారు 1.38 కోట్లు లీటర్ల నీరు తుఫాన్ వేగంతో సమీపంలోని కాలనీల్లో ఉన్న ఇళ్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఆ ప్రాంతంలోని ఇళ్లన్ని జలమయంగా మారిపోయాయి, ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో (స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీరు చేరడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. రాత్రి 2 గంటల సమయంలో కేడబ్ల్యూఏ ఫీడర్ పంప్ హౌస్‌కు చెందిన ట్యాంక్‌లో ఒక భాగం విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అకస్మాత్తుగా ఉప్పొంగిన నీటివల్ల అనేక ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు సహా విద్యుత్ పరికరాలు అన్ని నాశనమయ్యాయి. ప్రమాద సమయంలో చాలా మంది నివాసితులు నిద్రలో ఉన్నారు. వరద ప్రవాహంతో కొట్టుకొచ్చిన బురద, శిధిలాలు అనేక ఇళ్లలోకి ప్రవేశించాయి. దీంతో కొంతమంది ఇళ్ల పైకప్పులు కూలిపోగా, పలు వాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి.
ఈ ట్యాంక్‌ను సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు తెలిసింది. ఈ ట్యాంక్ ద్వారానే కొచ్చి, త్రిపునితుర ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్యాంక్ కూలిపోవడంతో కొచ్చి పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా సాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అలాగే ట్యాంక్ కూలడంతో జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
వీడియో చూడండి..
The Thammanam region in Kochi was severely affected after the wall of a massive Kerala Water Authority (KWA) drinking water storage tank collapsed in the early hours of Monday. The tank had a capacity of 1.35 crore litres
📸 H. Vibhu pic.twitter.com/HsoZF82L0J
— The Hindu – Kerala (@THKerala) November 10, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.