రాజస్థాన్ లోని కోటాలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కు ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్ లోని భాగల్ పూర్ కు చెందిన అభిషేక్ కుమార్ కోటాలోని విజ్ఞాన్ నగర్ ప్రాంతంలోని తన అద్దె గదిలో శవమై కనిపించాడు. ఇంజనీరింగ్, వైద్య విద్యార్థులకు కోచింగ్ హబ్ గా పిలువబడే నగరంలో ఒకే ఏడాదిలో ఆరుగురు విద్యార్థులు చనిపోవడం కలిచివేస్తోంది. అభిషేక్ విషం తాగి సూసైడ్ నోట్ రాసి పెట్టాడని పోలీసులు తెలిపారు. ‘క్షమించండి నాన్నా, నేను జేఈఈ చేయలేను’ అని తన తండ్రిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అభిషేక్ తన కోచింగ్ సెంటర్లో జరగాల్సిన రెండు పరీక్షలకు గైర్హాజరయ్యాడని, మొదటిది జనవరి 29న, రెండోది ఫిబ్రవరి 19న జరిగిందని పోలీసులు తెలిపారు.
కోటా 2023 లో 26 ఆత్మహత్య కేసులను నమోదు చేసింది. అధిక ఒత్తిడి, ర్యాంకుల పేరుతో ప్రశాంతత లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలు పెరిగిపోతుండటంతో సంబంధింత అధికారులు రంగంలోకి ది సమస్యకు పరిష్కారమార్గాలు చూపే పనిలో పడ్డారు. ఏటా జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే రెండు లక్షల మంది విద్యార్థులను కోట నగరం ఆహ్వానిస్తోంది. మంచి ర్యాంకు రాబట్టలంటే ఇక్కడి విద్యార్థులు విపరీతమైన పోటీ ఒత్తిడిన తట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోటా యంత్రాంగం, కోచింగ్ పరిశ్రమకు చెందిన భాగస్వాముల సహకారంతో విద్యార్థుల ఆత్మహత్యలను పరిష్కరించడానికి గత సంవత్సరం అనేక కార్యక్రమాలు చేపట్టింది.
హాస్టల్ గదుల్లో ‘సూసైడ్ ప్రూఫింగ్’ ఫ్యాన్లను ఏర్పాటుచేసింది. ఈ పరికరాలలో స్ప్రింగ్ కాయిల్స్ ఉంటాయి. 20 కిలోల కంటే ఎక్కువ బరువున్న వస్తువు వేలాడదీస్తే సైరన్ను యాక్టివేట్ చేస్తుంది. కోటా హాస్టళ్ల సంఘం 2017లో ప్రతిపాదించినప్పటికీ, గత ఏడాది ఆగస్టులో ఆత్మహత్యలు పెరగడంతో జిల్లా యంత్రాంగం దీనిని తప్పనిసరి చేయడంతో ఇటీవలే వీటి సంఖ్య పెరిగింది. అయినా కూడా విద్యార్థులు చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.