దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది సోనాలిక సంస్థ. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను 25.5 కేడబ్ల్యూ నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీతో తయారు చేసినట్లుగా సోనాలిక గ్రూప్ ఈడీ రామన్ మిట్టల్ తెలిపారు. దీని నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు.
ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గంటకు 24.93 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుందని, ఒక్కసారి బ్యాటరీని చార్జింగ్ చేస్తే దాదాపు ఎనిమిది గంటలు పనిచేస్తుందని తెలిపారు. దీనికి కేవలం నాలుగు గంటల్లోనే పూర్తిగా చార్జింగ్ చేసే ఫాస్ట్ చార్జింగ్ సిస్టంను ఇస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను యూరప్‌లో డిజైన్ చేశామని, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో దీన్ని తయారు చేశామని మిట్టల్ వివరించారు. కాగా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ.5.99 లక్షలు ఉంటుందని సోనాలిక ట్రాక్టర్స్ సంస్థ తెలిపింది.