Snow Fall: హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి గిరిజన జిల్లాలో ఒక్కసారిగా విపరీతమైన మంచు కురుస్తోంది. రోహ్‌తాంగ్ పాస్‌లో 3 అడుగుల కంటే ఎక్కువ మంచు పొరలు పేరుకుపోయాయి. రోహ్‌టాంగ్ వద్ద ఉన్న అటల్ టన్నెల్ రెండు చివర్లలో, మంచు పొర 3 నుండి 5 అంగుళాల వరకు స్తంభింపజేసింది. దీంతో అక్కడి అధికారులు ముందుజాగ్రత్త చర్యగా లోయలో పర్యాటక వాహనాల రాకపోకలను నిషేధించింది. శనివారం నుంచి ఇక్కడ మంచు కురవడం ఎక్కువైంది. రోడ్లు మంచుతో నిండిపోవడం ప్రారంభం అయింది. అయితే, ఇది ఆదివారం మరింత తీవ్రం అయి రోడ్లు మీద మంచు ఎక్కువగా పేరుకుపోయింది. దీంతో అధికారులు అటల్ టన్నెల్ ద్వారా వచ్చే పర్యాటక వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించింది.
ప్రస్తుతం, లోయలోని సిస్సు వద్ద 3 నుండి 4 అంగుళాలు, తాండి వద్ద 2 అంగుళాలు, జిల్లా ప్రధాన కార్యాలయం కీలాంగ్‌లో ఒకటి నుండి రెండు అంగుళాల తాజా హిమపాతం నమోదైంది. అయితే, ఉదయపూర్ ప్రాంతంలో కూడా హిమపాతం కొనసాగుతోంది. ఇది కాకుండా, మనాలి-లేహ్ రహదారిపై కీలాంగ్ దాటి వాహనాల కదలిక నిలిపివేశారు. హిమపాతం కారణంగా లోయలోని ఈ ప్రాంతంలో రోడ్లు జారుడుగా మారాయి.
మరోవైపు కాజా సబ్ డివిజన్ లోనూ కుంజుమ్ పాస్ సహా లోసార్, కాజా ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు, స్థానికులు అనవసరంగా పర్వతం వద్దకు వెళ్లవద్దని డిప్యూటీ కమిషనర్ కుల్లు అశుతోష్ గార్గ్ విజ్ఞప్తి చేశారు.
కులులో కూడా..
కులులో కూడా మంచు కురుస్తోంది. ఇక కులు జిల్లాలో అన్ని ఎత్తైన శిఖరాలపై మంచు కురుస్తుంది.దిగువ ప్రాంతంలో వర్షం ప్రారంభమైంది. చంద్రఖని, హనుమాన్ టిబ్బా, భృగు తుంగ్, అంజనీ మహాదేవ్, ఇంద్ర కోట, రుద్రనాగ్, ఖీర్గంగా, జలోదిపాస్, శ్రీల్సర్, వాస్లూ జోట్ సహా జిల్లాలోని అన్ని కొండలలో మంచు కురుస్తోంది. పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: City Transformer: ఎలక్ట్రిక్ కార్లలో మరో సంచలనం.. త్వరలోనే మార్కెట్లోకి కొత్త కారు.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?