Jaya Prada: కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో పరారీలో ఉన్న బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. పలుమార్లు నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ జయప్రద కోర్టు విచారణకు హాజరుకాలేదు. పలుమార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసినప్పటికీ ఫిబ్రవరి 27న ఆమె హాజరుకాలేదు.

Jaya Prada: కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద
Jayapradha

Updated on: Mar 04, 2024 | 7:14 PM

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో పరారీలో ఉన్న బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. పలుమార్లు నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ జయప్రద కోర్టు విచారణకు హాజరుకాలేదు. పలుమార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసినప్పటికీ ఫిబ్రవరి 27న ఆమె హాజరుకాలేదు. దీంతో రాంపూర్లోని ఎంపీ/ ఎమ్మెల్యే కోర్టు సీఆర్పీసీ ఆర్డర్ 82 జారీ చేసింది. దీనిపై సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి అమర్నాథ్ తివారీ మాట్లాడుతూ జయప్రదపై 2019 ఎన్నికల కోడ్ కేసు రాంపూర్లోని ప్రత్యేక ఎంపీ/ ఎమ్మెల్యే కోర్టు, కెమ్రీ పోలీస్ స్టేషన్, స్వర్ పోలీస్ స్టేషన్లో నమోదైందని తెలిపారు.

2019 లోక్ సభ ఎన్నికల తర్వాత జయప్రదపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల సమయంలో రాంపూర్ లో బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్న జయప్రద ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించినవే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమె రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసుల్లో రాంపూర్ జిల్లా కోర్టు ఆమెకు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె కోర్టుకు హాజరుకాలేదు.

దీంతో ఆమెపై ఇటీవలే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ట్రయల్ కోర్టు. అయినా ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని ప్రత్యేక కోర్టు ఆమెను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఈ వారెంటును సవాలు చేస్తూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. అనేక నాటకీయాల మధ్య చివరకు ఆమె కోర్టులో లొంగిపోయారు. 1974లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1976లో వచ్చిన భూమి కోసం సినిమాలో ఒక పాట ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమైంది.

Follow Us